BREAKING
కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రీజినల్ కోఆర్డినేషన్ కోర్ కమిటీ సమావేశంకడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లండన్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలు ఇరాన్‌పై గెలుపు.. స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న భారత మహిళల కబడ్డీ జట్టు! భారత్-జిసిసి మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కర్నూలు కంటి వైద్యశాల లో త్రీడి ఆప్టికల్ కొహరెన్సిటోమోగ్రఫీ పరికరం ప్రారంభం డీఆర్ కాంగోలో ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు ఆర్మీ జనరల్స్ సహా 14 మంది మృతి జార్ఖండ్‌లో ఎడతెరిపిలేని వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన నదులు, ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాలు వీరనారి ఐలమ్మ జయంతి వేడుకలు.. నిమజ్జనాల్లో విషాదం చాకలి ఐలమ్మ పోరాట యోధురాలు ఐరాస భద్రతా మండలిలో ఆఫ్రికాకు శాశ్వత సభ్యత్వం ఎందుకు కొలిక్కిరావడం లేదు.. ఐరాస 81వ సర్వసభ్య సమావేశాల్లో కీలక చర్చ భారత ఎన్నికల విశ్వసనీయతపై తీవ్ర చర్చ.. అపూర్వమైన పరిశీలన, ఆరోపణల వెనుక అసలు కారణాలివే సిరిసిల్లలో ఐలమ్మ జయంతి వేడుకలు.. మొరాకో పార్లమెంట్ ఎన్నికల్లో పీఏఎం భారీ విజయం.. మెజారిటీకి చేరువలో నిలిచిన పార్టీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని అందిపుచ్చుకుంటూనే ముప్పులను అరికట్టాలి.. ఐరాస వేదికగా విదేశాంగ మంత్రి జైశంకర్ పిలుపు

*ఓటర్ నమోదులో అక్రమాలే ఎజెండా *సీఈసీపై చర్యకు తీర్మానం?

Select Suryaa Now
*ఓటర్ నమోదులో అక్రమాలే ఎజెండా *సీఈసీపై చర్యకు తీర్మానం?

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం ఈ నెల 29న ఢిల్లీలో జరగనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ వ్యవహారంపై సమావేశంలో కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల కమిషన్‌లో భిన్నాభిప్రాయాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, జ్ఞానేశ్‌ కుమార్‌పై తదుపరి కార్యాచరణకు కాంగ్రెస్‌ నాయకత్వం వ్యూహాన్ని ఖరారు చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

పార్లమెంట్‌లో తీర్మానంపై చర్చ

జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌ను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లే అంశంపై సీడబ్ల్యూసీలో చర్చ జరగనుంది. పార్లమెంట్‌ వేదికగా ఈ అంశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, కేంద్ర ప్రభుత్వంపై ఏ విధంగా ఒత్తిడి పెంచాలన్న దానిపైనా నేతలు చర్చించే అవకాశం ఉంది. 

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్‌, జైరాం రమేశ్‌ తదితర సీనియర్‌ నేతలు హాజరుకానున్నారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్య నేతలు కూడా సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

ఇండియా కూటమితో సమన్వయంపైనా చర్చ

జ్ఞానేశ్‌ కుమార్‌ అంశంతో పాటు రానున్న ఎన్నికలకు పార్టీ సన్నద్ధత, ప్రతిపక్ష పార్టీలతో సమన్వయం, ఎన్నికల వ్యూహాలపైనా సీడబ్ల్యూసీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఎన్నికల సంఘానికి సంబంధించిన వివాదంపై ఇప్పటికే కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టిన నేపథ్యంలో 29న జరిగే సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.