BREAKING
భారత ఎన్నికల విశ్వసనీయతపై తీవ్ర చర్చ.. అపూర్వమైన పరిశీలన, ఆరోపణల వెనుక అసలు కారణాలివే సిరిసిల్లలో ఐలమ్మ జయంతి వేడుకలు.. మొరాకో పార్లమెంట్ ఎన్నికల్లో పీఏఎం భారీ విజయం.. మెజారిటీకి చేరువలో నిలిచిన పార్టీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని అందిపుచ్చుకుంటూనే ముప్పులను అరికట్టాలి.. ఐరాస వేదికగా విదేశాంగ మంత్రి జైశంకర్ పిలుపు అమెరికా డీజిల్ ఎగుమతుల నిషేధం విధిస్తే పరిస్థితి ఏమిటి.. గ్లోబల్ ఇంధన మార్కెట్లో తీవ్ర సంక్షోభ ముప్పు పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం వేళ రియాద్‌లో మిత్రదేశాల అత్యవసర భేటీ.. అణు కార్యక్రమం శాంతియుతమేనన్న ఇరాన్ ఐరాసలో ప్రసంగిస్తున్న నెతన్యాహును చూసి వాకౌట్ చేసిన అంతర్జాతీయ ప్రతినిధులు.. సొంతగడ్డపై మాత్రం హర్షాతిరేకాలు *ఓటర్ నమోదులో అక్రమాలే ఎజెండా *సీఈసీపై చర్యకు తీర్మానం? పాండమిక్ ముప్పును ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పనిచేయాలి పట్నం దంపతులతో పారిజాత భేటీ సైనిక చర్యలతో హోర్ముజ్ జలసంధి భద్రత సాధ్యం కాదు.. పాశ్చాత్య దేశాలకు ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టీకరణ గల్ఫ్ సంక్షోభం వేళ ఇరాన్, ఒమన్ విదేశాంగ మంత్రులతో జైశంకర్ భేటీ.. శాంతి, భద్రతలపై న్యూయార్క్‌లో విస్తృత చర్చలు ఐలమ్మ వీర వనిత పోలీసుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి అనంతపురంలో ఘనంగా పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ పాసింగ్ అవుట్ పరేడ్

తెలుగు రాష్ట్రాల్లో వాయుగుండ ప్రభావం

Select Suryaa Now
తెలుగు రాష్ట్రాల్లో వాయుగుండ ప్రభావం

హైదరాబాద్‌: తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. వాయుగుండం తీరం దాటినప్పటికీ దాని ప్రభావంతో రానున్న 24 గంటల్లో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో నిన్నటితో పోలిస్తే వర్షాల తీవ్రత కొంత తగ్గినప్పటికీ, పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ప్రస్తుతం తీవ్ర వాయుగుండం ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా వైపు కదులుతోంది. దీని ప్రభావంతో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు.

అదే సమయంలో తెలంగాణలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.