అనంతపురంలో ఘనంగా పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ పాసింగ్ అవుట్ పరేడ్
అనంతపురం బ్యూరో
అనంతపురంలో ఘనంగా పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ పాసింగ్ అవుట్ పరేడ్
జిల్లా పోలీస్ ట్రైనింగ్ కాలేజ్‌లో శనివారం ఉదయం SCTPC (Civil) బ్యాచ్ 2025–26కు చెందిన శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బంది పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్, జిల్లా ఎస్పీ జగదీష్, ఐపీఎస్, పీటీసీ ప్రిన్సిపల్ సుప్రజ, ఐపీఎస్తో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసు సిబ్బంది క్రమశిక్షణతో నిర్వహించిన పరేడ్ ఆకట్టుకుంది. శిక్షణలో భాగంగా వారు పోలీసు విధులు, క్రమశిక్షణ, ప్రజా భద్రతకు సంబంధించిన అంశాల్లో శిక్షణ పొందారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బందిని అధికారులు అభినందించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ పోలీసు శాఖ ప్రతిష్ఠను మరింత పెంచేలా విధులు నిర్వర్తించాలని సూచించారు.