BREAKING
భారత్-జిసిసి మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కర్నూలు కంటి వైద్యశాల లో త్రీడి ఆప్టికల్ కొహరెన్సిటోమోగ్రఫీ పరికరం ప్రారంభం డీఆర్ కాంగోలో ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు ఆర్మీ జనరల్స్ సహా 14 మంది మృతి జార్ఖండ్‌లో ఎడతెరిపిలేని వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన నదులు, ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాలు వీరనారి ఐలమ్మ జయంతి వేడుకలు.. నిమజ్జనాల్లో విషాదం చాకలి ఐలమ్మ పోరాట యోధురాలు ఐరాస భద్రతా మండలిలో ఆఫ్రికాకు శాశ్వత సభ్యత్వం ఎందుకు కొలిక్కిరావడం లేదు.. ఐరాస 81వ సర్వసభ్య సమావేశాల్లో కీలక చర్చ భారత ఎన్నికల విశ్వసనీయతపై తీవ్ర చర్చ.. అపూర్వమైన పరిశీలన, ఆరోపణల వెనుక అసలు కారణాలివే సిరిసిల్లలో ఐలమ్మ జయంతి వేడుకలు.. మొరాకో పార్లమెంట్ ఎన్నికల్లో పీఏఎం భారీ విజయం.. మెజారిటీకి చేరువలో నిలిచిన పార్టీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని అందిపుచ్చుకుంటూనే ముప్పులను అరికట్టాలి.. ఐరాస వేదికగా విదేశాంగ మంత్రి జైశంకర్ పిలుపు అమెరికా డీజిల్ ఎగుమతుల నిషేధం విధిస్తే పరిస్థితి ఏమిటి.. గ్లోబల్ ఇంధన మార్కెట్లో తీవ్ర సంక్షోభ ముప్పు పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం వేళ రియాద్‌లో మిత్రదేశాల అత్యవసర భేటీ.. అణు కార్యక్రమం శాంతియుతమేనన్న ఇరాన్ ఐరాసలో ప్రసంగిస్తున్న నెతన్యాహును చూసి వాకౌట్ చేసిన అంతర్జాతీయ ప్రతినిధులు.. సొంతగడ్డపై మాత్రం హర్షాతిరేకాలు

ఐలమ్మ వీర వనిత

Select Suryaa Now
ఐలమ్మ వీర వనిత

*ఆమె స్ఫూర్తి చిరస్మరణీయం*

*మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్*

*ఐలమ్మ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, బీఆర్ఎస్ శ్రేణులు*

షాద్‌నగర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఉన్న వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహానికి జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. అన్యాయాన్ని, అణచివేతను ఎదిరించి హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన చాకలి ఐలమ్మ జీవితం తెలంగాణ సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఐలమ్మ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడంతో పాటు పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటం చేసిన ధీరవనితగా చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు, సామాజిక న్యాయం కోసం నిలబడేందుకు ఐలమ్మ జీవితం నేటి తరానికి స్ఫూర్తినిస్తుందని అన్నారు. ఆమె ఆశయాలను గుర్తుచేసుకుంటూ సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మకు ఘన నివాళులు అర్పిస్తూ ఆమె పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అంజయ్య యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వసంత శ్రీనివాస్, శారద శేఖర్, పిన్నమోని గోపాల్, మాజీ కౌన్సిలర్లు వెంకట్రాం రెడ్డి, కానుగు అంతయ్య, నందకిషోర్, నాయకులు రవి యాదవ్, నందిగామ శ్రీనివాస్, జుట్టు బాలరాజు, శ్రీను, కొండ మల్లేష్, జమాల్ ఖాన్ తదితరులు, రజకసంఘం నాయకులు పాల్గొని నివాళులర్పించారు.

- నరసింహారెడ్డి : ఫరూఖ్ నగర్, మేజర్ న్యూస్