BREAKING
సిరిసిల్లలో ఐలమ్మ జయంతి వేడుకలు.. మొరాకో పార్లమెంట్ ఎన్నికల్లో పీఏఎం భారీ విజయం.. మెజారిటీకి చేరువలో నిలిచిన పార్టీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని అందిపుచ్చుకుంటూనే ముప్పులను అరికట్టాలి.. ఐరాస వేదికగా విదేశాంగ మంత్రి జైశంకర్ పిలుపు అమెరికా డీజిల్ ఎగుమతుల నిషేధం విధిస్తే పరిస్థితి ఏమిటి.. గ్లోబల్ ఇంధన మార్కెట్లో తీవ్ర సంక్షోభ ముప్పు పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం వేళ రియాద్‌లో మిత్రదేశాల అత్యవసర భేటీ.. అణు కార్యక్రమం శాంతియుతమేనన్న ఇరాన్ ఐరాసలో ప్రసంగిస్తున్న నెతన్యాహును చూసి వాకౌట్ చేసిన అంతర్జాతీయ ప్రతినిధులు.. సొంతగడ్డపై మాత్రం హర్షాతిరేకాలు *ఓటర్ నమోదులో అక్రమాలే ఎజెండా *సీఈసీపై చర్యకు తీర్మానం? పాండమిక్ ముప్పును ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పనిచేయాలి పట్నం దంపతులతో పారిజాత భేటీ సైనిక చర్యలతో హోర్ముజ్ జలసంధి భద్రత సాధ్యం కాదు.. పాశ్చాత్య దేశాలకు ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టీకరణ గల్ఫ్ సంక్షోభం వేళ ఇరాన్, ఒమన్ విదేశాంగ మంత్రులతో జైశంకర్ భేటీ.. శాంతి, భద్రతలపై న్యూయార్క్‌లో విస్తృత చర్చలు ఐలమ్మ వీర వనిత పోలీసుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి అనంతపురంలో ఘనంగా పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ పాసింగ్ అవుట్ పరేడ్ అక్రమార్జనతో అంతస్తులు కట్టుకుంటే...

ఐలమ్మ జీవితం స్పూర్తి దాయకం

Select Suryaa Now
ఐలమ్మ జీవితం స్పూర్తి దాయకం

ఎమ్మెల్యే కాలే యాదయ్య
 తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ స్ఫూర్తిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని శనివారం చేవెళ్లలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. అన్యాయాన్ని, అణచివేతను ఎదిరించి ధైర్యంగా నిలిచిన ఐలమ్మ స్ఫూర్తిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చాకలి ఐలమ్మ సేవలు, పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సమతా వెంకట్ రెడ్డి, రెడ్డి, వైస్ చైర్మన్ కాసుల రాముగౌడ్, కౌన్సిలర్లు బండారి శైలజాఆగిరెడ్డి, మద్దెల శ్రీనివాస్, దావల్ గారి గోపాల్ రెడ్డి, చేవెళ్ల, ముడిమ్యాల సొసైటీ చైర్మన్లు దేవర వెంకట్ రెడ్డి, గోనె ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు బి.శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షులు గిరిధర్ రెడ్డి, మాజీ సర్పంచులు, రజక సంఘం నాయకులు, ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- సున్నపు ప్రవీణ్ ; మేజర్ న్యూస్, చేవెళ్ల.