BREAKING
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి సమాజానికి ఆదర్శం సూర్య ఎఫెక్ట్ ఆరాకిల్ పీపుల్‌సాఫ్ట్‌పై సైబర్ దాడులు తీవ్రం 'ఒడిడో' వాటాల కొనుగోలుకు రూపుదిద్దుకుంటున్న అపాక్స్ ఒప్పందం! తెలంగాణ తెగువను చాటి చెప్పిన వీరనారి చాకలి ఐలమ్మ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మహిళా శక్తికి స్ఫూర్తిదాయకం ఈ నెల 27 నుంచి ప్రారంభం.. తహసీల్దార్ సహా ముగ్గురు సస్పెన్షన్ పాండవుల గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి బలూచిస్థాన్‌లో దశాబ్దాలుగా పాకిస్థాన్ దారుణ అణచివేత.. ఐరాస వేదికగా బీఎన్ఎం చీఫ్ తీవ్ర ఆరోపణలు పెంచల స్వామికి శేష వాహన సేవ బ్రిజ్ భూషణ్ నిర్దోషిత్వ తీర్పుపై మహిళా రెజ్లర్ల అప్పీల్.. విచారణను సెప్టెంబర్ 28కి వాయిదా వేసిన ఢిల్లీ కోర్టు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అభివృద్ధి జాతర బలహీనపడిన తీవ్ర వాయుగుండం.. దక్షిణ బెంగాల్‌లో భారీ వర్షాల నుంచి ఊరట

చాకలి ఐలమ్మ పోరాట యోధురాలు

Select Suryaa Now
చాకలి ఐలమ్మ పోరాట యోధురాలు

చాకలి ఐలమ్మ ​పోరాట యోధురాలు
-సిపిఐ జిల్లా నాయకులు శ్రీనివాస్
గార్ల, 26 సెప్టెంబర్ సూర్య (మేజర్ న్యూస్)ధైర్యానికి ప్రతిరూపం, పేదల గొంతుక, నిరంకుశ దోపిడీని ఒంటి కాలు పై ఎదిరించిన వీరనారి చాకలి ఐలమ్మ చేసిన పోరాటాలు నేటి మహిళలకు ఆదర్శనియమని సిపిఐ జిల్లా నాయకులు కట్టెబోయిన శ్రీనివాస్ అన్నారు. శనివారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించినారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..​భూస్వామ్య విధానానికి, రజాకారుల అణచివేతలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో తుపాకి పట్టి, తన భూమిని, ఆత్మగౌరవాన్ని కాపాడుకున్న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలన్నారు. బహుజన మహిళా "సింహం" చాకలి ఐలమ్మ అని గుర్తు చేశారు. ​నాడు ఆమె చూపిన తెగువ, పోరాట పటిమ నేటి తరానికి.. ఎప్పటికీ గొప్ప స్ఫూర్తిదాయక మన్నారు. ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్ళాలని, ఆత్మగౌరవంతో బతికే మార్గాన్ని ఎంచుకుందమన్నారు.
​వీరనారి చాకలి ఐలమ్మ  జయంతిని ఏటా ఘనంగా జరుపుకుందామని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి జంపాల వెంకన్న, నాయకులు హరి, లోకేష్, రాజేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.