BREAKING
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ - విద్యార్థి విద్యాసంస్థల అధ్యర్యంలో బతుకమ్మ సంబురాలు స్టార్ డైరెక్టర్ వివి వినాయక్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ బర్త్ డే విషెస్! చిక్రం శ్రీనివాస్ కుటుంబానికి గ్రామస్థుల ఆర్థిక సహాయం జనగామ జిల్లా ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ గా గోసంగి కిషన్ నియామకం ఉన్నత పాఠశాలకు క్రీడా పరికారలు ఏర్పుమల్లలో ఘనంగా బతుకమ్మ సంబరాలు రహదారిని కమ్మేసిన ముళ్ళ పొదలు వేలాడుతున్న చెట్టు కొమ్మ తొలగింపు.. స్పందించిన ఉట్నూర్ సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై రేపు కేబినెట్ లో చర్చ సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు 986(1)ఏ సర్వే నంబర్ భూముల సమస్యకు పరిష్కారం.. 100 కుటుంబాలకు ఊరట! రైతుల కష్టాలు చూసి చలించిన మాతృహృదయం.. సొంత ఖర్చులతో డొంక దారి బాగు చేసిన పోకల శ్రీనివాసరావు అశ్వారావుపేటలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం* మసీదు సమీపంలో మద్యం దుకాణం వద్దు.. స్థానికుల నిరసన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఘన స్వాగతం

పండుగల వేళ కావలిలో విస్తృత వాహన తనిఖీలు

Select Suryaa Now
పండుగల వేళ కావలిలో విస్తృత వాహన తనిఖీలు
 

కావలి,   మేజర్ న్యూస్ :  నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు 

నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల ఆదేశాలతో కావలి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. వన్‌టౌన్ సీఐ రంగనాథ్ గౌడ్, ఎస్ఐ సుమన్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టి వాహనదారులకు పలు సూచనలు చేశారు.    వన్‌టౌన్ సీఐ రంగనాథ్ గౌడ్, ఎస్ఐ సుమన్ ఆధ్వర్యంలో పోలీసులు సిబ్బందితో కలిసి వాహనాలను ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాల తనిఖీల్లో భాగంగా కార్లలో అనుమానాస్పద వస్తువులు, నిషేధిత పదార్థాలు ఉన్నాయా అని తనిఖీ చేశారు.    ద్విచక్ర వాహనదారుల లైసెన్స్‌లు, వాహన పత్రాలు, హెల్మెట్ వినియోగం తదితర అంశాలను పరిశీలించారు.   ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.