BREAKING
ఓటు లెక్కింపులో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ముగిసిన రెండో విడత ప్రసారం కోల్ ఇండియా స్థాయి క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించాలి బంగారం కోసం వృద్ధురాలి హత్య కేసు... -- ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా మంత్రి శ్రీధర్ బాబు సర్పంచ్ అభ్యర్థులతో పోలీసుల ఎన్నికల అవగాహన సమావేశం ఇంటింటికీ మెరుగైన వైద్యం అందేలా పనిచేయాలి గొట్టిపల్లి సర్పంచ్‌గా అవ్వ తేజేశ్వరి ఏకగ్రీవ ఎన్నిక.. గత ప్రభుత్వ హయాంలోనే హుజురాబాద్ అభివృద్ధి -- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పూర్ణిమకు మద్దతుగా మహిళల భారీ ర్యాలీ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కోటబొమ్మాళి విద్యార్థిని ఎంపిక ఆర్థిక సహాయం...... మేజర్ పంచాయతీ పోరు రసవత్తరం.. భూ వివాదాలకు తావులేని గ్రామాలే లక్ష్యం. తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి

పంచాయతీ పోరులో కూటమి విజయకేతనం!

Select Suryaa Now
పంచాయతీ పోరులో కూటమి విజయకేతనం!

గరుగుబిల్లి ,నవంబర్ 27, మేజర్ న్యూస్:గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు విజయకేతనం ఎగుర వేయడం జరిగిందని...గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలనను మెచ్చి ప్రజలు ఈ చారిత్రాత్మక తీర్పును ఇచ్చారని గరుగు బిల్లి మండల పరిషత్ అధ్యక్షులు మరడాన నారాయణస్వామి పేర్కొన్నారు.మండల పరిధిలోని ఉల్లిభద్ర గ్రామంలో శుక్రవారం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ) మరడాన నారాయణస్వామి విలేకరు లతో మాట్లాడారు.కూటమి బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించిన మండల ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.గ్రామీణ ఓటర్లు అభివృద్ధి, సంక్షేమ పాలన వైపే మొగ్గు చూపారనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ఎంపీపీ మరడాన నారాయణస్వామి వెల్లడించారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ (కూటమి) నాయకులు మరియు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయడం వల్లే మండలంలోని పలు పంచాయతీల్లో కూటమి మద్దతుదారు లు అఖండ విజయం సాధించారని తెలిపారు.నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లందరినీ సమన్వయం చేసు కుంటూ, మండలంలోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దు తామని హామీ ఇచ్చారు.తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. మండలంలోని అన్ని గ్రామాలను ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దేం దుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.గ్రామ పంచాయతీల ఎన్నిక ల్లో విజయం సాధించిన సర్పంచ్ లు, వార్డు సభ్యులకు ఎంపీపీ మరడాన నారాయణస్వామి ఈసందర్భంగా శుభాకాంక్షలు తెలిజేయశారు.