పింఛన్లు అక్టోబర్ 1వ తేదిన యధావిధిగా ఉదయం 6.30 గంటల నుండి పంపిణి*
*పింఛన్లు అక్టోబర్ 1వ తేదిన యధావిధిగా ఉదయం 6.30 గంటల నుండి పంపిణి*
*జిల్లా కలెక్టరు, డా. ఏ. సిరి*
కర్నూలు, సెప్టెంబర్ 29: రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు మూడు రోజుల పాటు చేయ తలపెట్టిన సమ్మె విరమించుకున్న కారణంగా పింఛనుదారులందరికి యధావిధిగా అక్టోబరు 1వ తేదిన ఉదయం 6.30 గంటల నుండి పించన్లు పంపిణి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30 తేదిన బ్యాంకుల నుండి నగదును డ్రా చేసి, అక్టోబరు 1వ తేది ఉదయం 6.30 గంటల నుంచి ఇంటింటికి తిరిగి పింఛన్లు పంపిణి చేయడం జరుగుతుందని, ఈ మార్పును జిల్లాలోని అందరు NTR భరోసా పించను లబ్దిదారులు గమనించాలని జిల్లా కలెక్టరు విజ్ఞప్తి చేశారు.