పెన్షనర్ల సమస్యలపై కేంద్ర ప్రభుత్వ వైఖరి సబబు కాదు : ఎంప్లాయిస్ అసోసియేషన్ పెన్షనర్లచే విద్రోహ దినం
మదనపల్లె టౌన్,మేజర్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ మదనపల్లె యూనిట్,అన్నమయ్య జిల్లా ఆధ్వర్యంలో సోమ వారం పెన్షనర్ల విద్రోహ దినంగా పాటిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు.రాష్ట్ర అధ్యక్షులు శాస్త్రి ఇచ్చిన పిలుపు మేరకు మదనపల్లెలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు,సభ్యులు పాల్గొని కేంద్ర ప్రభుత్వంతోపాటు ఈపీఎఫ్ఓ అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు రమణ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు నవంబర్ 16వ తేదీని పెన్షనర్ల విద్రోహ దినంగా పాటిస్తూ మదనపల్లె యూనిట్ తరఫున నిరసన తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎన్.మునిగోపాలకృష్ణ మాట్లాడుతూ నవంబర్ 16వ తేదీ పెన్షనర్ల జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజని తెలిపారు.పెన్షన్ ప్రారంభమైన తేదీని గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం ఈ రోజును పెన్షనర్ల విద్రోహ దినంగా పాటిస్తున్నామని వివరించారు.కేంద్ర ప్రభుత్వం,ఈపీఎఫ్ఓ పెన్షనర్ల సమస్యల పట్ల పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు.పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి బదులుగా మోసపూరిత,మొండి వైఖరిపైన ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నో ఏళ్లుగా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రతి ఏడాది నవంబర్ 16న నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.అసోసియేట్ ప్రెసిడెంట్లు శ్రీనివాసులు,రాజన్నలు మాట్లాడుతూ పెన్షనర్ల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండించారు.పదవీ విరమణ అనంతరం పెన్షన్‌పై ఆధారపడి జీవిస్తున్న విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం గుర్తించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు.జనరల్ సెక్రటరీ డా.మునిగోపాలకృష్ణ గత సమావేశపు మినిట్స్ ను సభ్యులకు చదివి వినిపించారు.ట్రెజరర్ తిమ్మయ్య అసోసియేషన్‌కు సంబంధించి జమా ఖర్చుల వివరాలను వెల్లడించగా,సభ్యులు ఆమోదించారు.మహిళా ప్రతినిధి సరస్వ తమ్మ మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో జరుగుతున్న జాప్యాన్ని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు.పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జగన్మోహన్,మహిళా ప్రతినిధులు శకుంతలమ్మ,సరస్వతమ్మ,ధనలక్ష్మి,సెక్రటరీ నాగభూషణం,డాక్టర్ గొల్లపూడి తిరుపతిరావు,టీఎస్ఏ కృష్ణమూర్తిలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి