పేదల నివాసాల కూల్చివేతపై రాజకీయమా..!
ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ పరిధిలో 44 వార్డు నందు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఇబ్రహీం కు మద్దతుగా నిలిచారని వార్డ్ లో నివాసం ఉంటున్న షఫీ రేకుల షెడ్డు ను రాజకీయ కక్ష సాధింపు తో కూల్చివేసారని బాధితులు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో సుమారు పదేళ్లుగా నివాసం ఉంటున్న పేద కుటుంబాల గుడిసెలను అధికారులు కూల్చివేయడం తీవ్ర చర్చకు దారితీసింది. మున్సిపల్ ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలిపినందుకే రాజకీయ కక్షతో తమ నివాసాలను తొలగించారని బాధితుడు పఫి ఆరోపించారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ప్రత్యామ్నాయ వసతి కల్పించకుండా ఇళ్లను కూల్చివేయడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, నివాస స్థలం లేని వారికి స్థలం కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు. పేదల నివాసాల తొలగింపు వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? లేక నిబంధనల ప్రకారమే చర్యలు చేపట్టారా? అన్నది తేలాల్సి ఉంది.y ఏదేమైనా, రాజకీయాలకు అతీతంగా నిరాశ్రయులైన పేద కుటుంబాలకు న్యాయం చేసి, వారికి ప్రత్యామ్నాయ నివాసం కల్పించాలని కోరుతున్నారు.
చెప్పినంత పని చేసేశారు.. షఫీ
ఎన్నికల ముందు టిడిపి అభ్యర్థి వై ఈరన్న వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నావు నీ రేకుల షెడ్డు పూజిస్తానని ముందే చెప్పారు గెలిచి ప్రమాణ స్వీకారం చేయకముందే నా కుటుంబంపై కుట్ర ప్రకారమే తన నివాసాన్ని కూల్చి నిలువు నీడ లేకుండా చేశారని సేఫ్టీ ఆరోపించారు.
A. R. శరత్ కుమార్, సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా