పత్తికొండ గ్రామపంచాయతీకి ‘స్వచ్ఛ ఆంధ్ర’ రాష్ట్రస్థాయి పురస్కారం
పత్తికొండ సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్ ప్రదానం స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026లో భాగంగా పత్తికొండ గ్రామపంచాయతీకి రాష్ట్రస్థాయిలో ‘స్వచ్ఛ గ్రామపంచాయతీ’గా విశిష్ట పురస్కారం దక్కింది. అమరావతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పత్తికొండ పంచాయతీ ప్రతినిధులు ఈ పురస్కారాన్ని అత్యంత వైభవంగా స్వీకరించారు.
పరిశుభ్రత నిర్వహన, వ్యర్థాల నిర్మూలన, పంచాయతీ పరిధిలో చేపట్టిన ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసింది.
కలెక్టర్ చేతుల మీదుగా కమెండేషన్ అవార్డు స్వీకరణ:
రాష్ట్రస్థాయి అవార్డుతో పాటు జిల్లా స్థాయిలో నిర్వహించిన కార్యక్రమంలో గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారి చేతుల మీదుగా కమెండేషన్ అవార్డును గౌరవ జిల్లా పంచాయతీ అధికారి (DPO) సార్, పత్తికొండ డిప్యూటీ ఎంపీడీవో సార్ మరియు పంచాయతీ అధికారులు అందుకున్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల నిరంతర కృషి, గ్రామస్తుల సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పత్తికొండను మోడల్ పంచాయతీగా మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. గ్రామపంచాయతీకి రాష్ట్రస్థాయి పురస్కారం రావడం పట్ల నియోజకవర్గ ప్రజలు, అధికారులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.వెల్దుర్తి సూర్య ప్రతినిధి షేక్ దస్తగిరి వెల్దుర్తి మండలం కర్నూలు జిల్లా