పరిశ్రమల స్థాపన దేశ ప్రగతికి సోపానం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
సూర్య న్యూస్ దర్శి.:చంద్రబాబు దార్శనికత, అనుభవాల నుంచి పుట్టిన మరో వినూత్న ఆలోచనే పెట్టుబడుల భద్రతకు ప్రత్యేక చట్టమని ,ఈ చట్టం అమల్లోకి వస్తే దేశ పారిశ్రామిక, ఆర్థిక పురోగతి ప్రపంచాన్నే అబ్బురపరుస్తుందని: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు.
ప్రభుత్వాలు, పాలకులు మారినప్పుడల్లా పాలసీలు, నిర్ణయాలు మారడమనే అనాలోచిత విధానం దేశ పారిశ్రామిక ప్రగతికి, ఆర్థిక వ్యవస్థకు గొడ్డలిపెట్టు వంటిదని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు.
పెట్టుబడుల భద్రతకు ప్రత్యేక చట్టం' ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత, అనుభవాల నుంచి పుట్టిన మరో వినూత్న ఆలోచన. ఆయనలోని అభివృద్ధి కాంక్ష, ప్రగతిశీల భావజాలానికి ప్రత్యక్ష నిదర్శనం. విశాఖ భాగస్వామ్య సదస్సు వేదిక సాక్షిగా ముఖ్యమంత్రి మరో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికారని డాక్టర్ లక్ష్మీ అన్నారు. చంద్రబాబు ఆలోచన కార్యరూపం దాలిస్తే, ప్రపంచమే అబ్బురపడేలా
భారత పారిశ్రామిక ప్రగతి, మరే దేశానికీ సాధ్యం కాని విధంగా దూసుకెళ్తుంది. కేంద్రం ప్రభుత్వం తక్షణమే ఈ చట్టాన్ని అమల్లోకి తేవాలని , ఈ చట్టం వల్ల దేశ ఆర్థిక, పారిశ్రామిక, ఉపాధి రంగాలు జెట్ స్పీడ్ తో పురోగమిస్తాయని డాక్టర్ లక్ష్మీ అన్నారు.