పలు వార్డుల్లో పర్యటించిన వైయస్ మనోహర్ రెడ్డి
పులివెందుల మేజర్ న్యూస్, :పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో మున్సిపల్ ఇన్‌చార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి మంగళవారం పర్యటించారు. భాకరాపురం, రెడ్డమ్మ వీధి, శ్రీరామ హాల్ రోడ్, ఆటోనగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రధానంగా యూజీడీ, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్య సమస్యలను పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే అధికారుల సమన్వయంతో సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని మనోహర్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు పార్నపల్లి కిషోర్, సీనియర్ నాయకులు కోడి రమణ, మాజీ కౌన్సిలర్ పురుషోత్తం, మాజీ కో-ఆప్షన్ సభ్యులు చంద్ర
మౌళి, నాయకులు వెంగళ్ రాయుడు, లక్ష్మీనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పి కృష్ణ పులివెందుల స్టాఫ్ రిపోర్టర్ వైఎస్ఆర్ కడప జిల్లా