పాఠశాల అభివృద్ధి నిర్వహణలో భాగస్వాములు కావాలి
రామభద్రపురం సూర్య: పాఠశాల అభివృద్ధి నిర్వహణ లో పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు భాగస్వాములు కావాలని నాయుడువలస పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ ఎం సి సెక్రటరీ కన్వీనర్ డాక్టర్ జె సి రాజు పిలుపు నిచ్చారు.శుక్రవారం పాఠశాలలో ఎస్ ఎం సి సమావేశాన్ని చైర్మన్ బి సత్యవతి అధ్యక్షతన సెక్రటరీ కన్వీనర్ డాక్టర్ జె సి రాజు నిర్వహించారు. హెచ్ ఎం డాక్టర్ జె సి రాజు మాట్లాడుతూ పాఠశాల సమగ్ర అభివృద్ధికి ఎస్ ఎం సి ఒక ముఖ్యమైన వేదికని అన్నారు.అందుకు తల్లితండ్రులు,ఉపాధ్యాయులు,సమాజ భాగస్వామ్యం అవసర మన్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ,చైర్మన్ సత్యవతిని,వైస్ చైర్మన్ మజ్జి గౌరీ మరియు కమిటీ సభ్యులను హెచ్ ఎం మరియు ఉపాధ్యాయులు దుస్సలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందించారు.అనంతరం చైర్మన్ సత్యవతి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి ,విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. విద్యార్థుల హాజరు,మద్యాన్న భోజనం, మరుగుదొడ్ల నిర్వహణ, పాఠశాలకు అవసరమైన వనరులు సమకూర్చడంలో కృషిచేస్తున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృష్ణం నాయుడు, రాజమ్మ, రమణ, ఉదయకుమారి,సబ్యులు దుర్గా,ఆరుద్ర, పోలమ్మ, మీనాక్షి,సింహాచలం ,సరస్వతి పాల్గొన్నారు