BREAKING
ఘనంగా తులసి దామోదర కళ్యాణం ఆసీస్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.. ఓపెనర్ల విధ్వంసంతో సిరీస్ సమం ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో వైభవ్ సూర్యవంశీ ఊచకోత.. 28 బంతుల్లోనే మెరుపు సెంచరీ కార్మికుల భద్రతకు సింగరేణి పెద్దపీట - ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె. నిరోష కందకుర్తి నది వద్ద సంతరించుకున్న కార్తీక శోభ కపిల్స్ కిచెన్ ను ప్రారంభించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో హర్ప్రీత్ సింగ్ భాటియా మెరుపు సెంచరీ.. యూఏఈ పోరాటం ఇలా బీజేవైఎం మండల అధ్యక్షులుగా చిట్యాల విజయ్ కుమార్ స్వర్ణ గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు భారత్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా.. కరారా ఓవల్‌లో అత్యధిక టీ20 స్కోరు! రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎస్‌ఐఆర్‌ పేరుతో కాలరాస్తారా? మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మా వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు.. పూర్తి సహకారం అందిస్తాం. మున్సిపల్ చైర్మన్. ఐపీఎల్ 2027కు న్యూజిలాండ్ స్టార్ పేసర్ గుడ్‌బై.. సీఎస్కే రిలీజ్ చేయగానే పీఎస్ఎల్‌తో భారీ డీల్! ఎన్డీయే కూటమి ఐక్యతతోనే గ్రామాల అభివృద్ధి శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి వేడుకలు

పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

Select Suryaa Now
పారిశుద్ధ్య  నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

జంగారెడ్డిగూడెం మేజర్ న్యూస్: పట్టణంలో పారిశుద్ధ్య  నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు.  స్థానిక పురపాలక సంఘ కార్యాలయాన్ని బుధవారం కలెక్టర్ వెట్రిసెల్వి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలకు మెరుగైన పౌర సేవలందించడం పురపాలక సంఘాల ప్రధాన బాధ్యతన్నారు.  పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైనేజీలు,  సురక్షిత త్రాగునీరు అందించడం, రోడ్లు, వీధి దీపాల నిర్వహణ, తదితర సేవలను పౌరులకు సక్రమంగా అందించాల్సిన బాధ్యత మునిసిపల్ అధికారులు, సిబ్బందిపై ఉందన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, రోడ్లపై ఎక్కడైనా చెత్త కనపడినా, డ్రైన్లలో మురుగునీరు నిల్వ, ఉన్న, వీధి దీపాలు వెలగకపోయినా, రోడ్లు మరమ్మత్తులు పూర్తికాకపోయినా మునిసిపల్ సిబ్బందిని బాధ్యులను చేస్తాసనన్నారు.  పన్నులను లక్ష్యాల మేర వసూలు చేయాలనీ, అదే సమయంలో పౌరులకు మెరుగైన సేవలందేలా చూడాలన్నారు. పౌర సేవలు అందించడంలో విఫలమయ్యారని ప్రజల నుండి ప్రజల నుండి ఫిర్యాదులు వస్తే విచారణ చేసి సంబంధిత  సిబ్బందిపై చర్యలు తీసుకుంటానన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది తెల్లవారుఝాము నుంచే పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య పనులను మునిసిపల్ కమీషనర్ ఉదయం నుండి పర్యవేక్షించాలన్నారు.  ప్రజల నుండి  అందిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.

             మునిసిపల్ కమీషనర్  కె. వి. రమణ, తహసీల్దార్ స్లీవ్ జోజి, మునిసిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది,  ప్రభృతులు పాల్గొన్నారు.

----------------------------------------------------

 కే వి రమణారావు జంగారెడ్డిగూడెం