పాచిపెంటలో టిడిపి జెడ్పిటిసి, ఎంపిటిసి అభ్యర్థులు ప్రచారం
పాచిపెంట, సూర్య : మండల కేంద్రంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ జడ్పిటిసి మరియు ఎంపీటీసీ అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేపట్టారు. పాచిపెంట గ్రామంలో 3వ సెగ్మెంట్ అంపోల గౌతమి, రెండవ సెగ్మెంట్ సాలూరు సావిత్రమ్మకు అలాగే జడ్పిటిసి అభ్యర్థి మతల సౌజన్య లను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు, ఈ సందర్భంగా జడ్పిటిసి అభ్యర్థి మతల సౌజన్య మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. అలాగే మన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సాలూరు నియోజకవర్గం ఎన్నో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు నిమిత్తం అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. టిడిపి పార్టీ జెడ్పిటిసి అభ్యర్థిగా నన్ను మతల సౌజన్యను గెలిపిస్తే మండల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే వేస్తే మండల అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. మండలంలో 14 సెగ్మెంట్లో పరిధిలో గల అన్ని గ్రామాల్లోనూ ఎన్నికల ప్రచారం చేపట్టినట్లు తెలిపారు. ఈ ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మతల బలరాం, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.