ఓట్లను తొలగించి ప్రజాస్వామ్యం ఖూనీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి.సాకే హరి
అనంతపురం బ్యూరో : సామాన్యుల ఓట్లు తొలగించి బీజేపీ ప్రభుత్వం పాపం మూటకట్ట కుందని సూత్రదారి జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి డిమాండ్ చేశారు.ఆదివారం అనంతపురం నగరంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు ఢిల్లీ జంతర్ మంతర్ లో కాక్రోచ్ జనతా పార్టీ యువత ఆధ్వర్యంలో బీజేపీ,సీఈసీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు సంఘీభావంగా నిరసన చేపట్టారు.ఈ సందర్బంగా సాకే హరి మాట్లాడుతూ..దేశ రాజధాని ఢిల్లీలో సామాన్యుల ఓట్లను తొలగించిన సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ఢిల్లీని చుట్టముట్టారని దింతో ఉద్యమకారులను అణిచివేయడానికి ఢిల్లీ ఒక సైనిక కోటగా మారిపోయిందన్నారు.ధర్నాకు పిలుపునిచ్చిన సీజేపీ వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కకీలక నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాను మధ్యలోనే అరెస్టు చేయడం దారుణమన్నారు.జెన్ జీ యువతను అడ్డుకోవడానికి 250రైళ్లు రద్దు చేసి 45 మెట్రో స్టేషన్లు మూసి ఇంటర్ నెట్ అపి ఏకంగా 30వేల మంది పోలీస్ బాలగాలు దించారంటే కేంద్రానికే వణుకుపుట్టించారని ఇప్పటికైనా జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసి క్రిమినల్ కేసు నమోదు చేయించాలి లేదంటే బీజేపీకి మనుగడ ఉండదన్నారు.ఉద్యమకారులపై ప్రైవేటు వ్యక్తులు చొరబడి పోలీసుల సమక్షంలోనే భౌతిక దాడులు చేస్తున్న మౌనం వహించడం ఘోరమన్నారు.ఓటు చోరీ ఉద్యమం అంతర్జాతీయ స్థాయికి చేరుకుందని యువతపై నిర్భందాన్ని ఐక్య రాజ్య సమితి అందోళన వ్యక్త పరిచిందని దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ వామపక్ష పార్టీలు ప్రజాస్వామిక అభ్యుదయవాదులు మహిళలు విద్యార్థులు ఐఖ్యంగా సంపూర్ణ మద్దతు తెలపడం శుభపరిణామన్నారు.సర్ ప్రక్రియలో దేశంలో 13కోట్ల 54లక్షల ఓట్లు తొలగించి ప్రజాస్వామ్యాన్ని ఖుని చేయడమే కాక అడ్డదారిలో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వంకు పాలించే అర్హత లేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పద్దతిలో ప్రజల కనీస హక్కుల సాధన కోసం పోరాటం చేస్తున్న జెన్ జీ ఉద్యమాలకు అండగా నిలుస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమద్ది ఓబులేసు.భారత్ బహుజన ప్రంట్ RK ఓబులేష్,బేడ బుడగ జంగాల రాష్ట్ర కార్యదర్శి శిరిశాల అంజి.రజక సంఘం ఈశ్వరయ్య.పూసల సంఘం తిక్కన్న,శేషు.జేఏసీ నాయకులు.శ్రీధర్,అదాం,ఈరన్న,సాయి, మనోజ్, ఉపేంద్ర, నారాయణ స్వామి,అంకె హరి, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.