BREAKING
కార్తీక పౌర్ణమి సందర్భంగా నవ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు ఢిల్లీలో కాలుష్యం తీవ్రత దృష్ట్యా ఎయిర్ ప్యూరిఫయర్లకు ఐదు రెట్లు పెరిగిన డిమాండ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా నూతన పెన్షన్ పత్రాల పంపిణీ భారతీయ సంస్కృతి, సామాజిక సమైక్యతకు ఛత్‌ పూజ ప్రతీక: ఎంపీ ఈటల రాజేందర్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కల్పించాలి దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి: హమాస్ కమాండర్ హతం ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన గొల్ల నరసింహ యాదవ్ సోదరులకు ఘన సన్మానం. మల్లూరు గుట్టకు మహిళల పాదయాత్ర నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలకు ఘన సత్కారం.. ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డిపిఓ. ఎంపీడీవో డిప్యూటీ ఎంపీడీవో సాలూరు రైలు బండిని పునరుద్ధరించండి

ఒకే తల.. రెండు శరీరాలు.. ఎనిమిది కాళ్లు!

Select Suryaa Now
ఒకే తల.. రెండు శరీరాలు.. ఎనిమిది కాళ్లు!

 

భోగాపురం, మేజర్ న్యూస్: ప్రకృతి సృష్టిలో ఎన్నో వింతలు.. విశేషాలు. అలాంటి అరుదైన ఘటనే భోగాపురం మండలంలో చోటుచేసుకుంది. ఒకే తలతో రెండు శరీరాలు, ఎనిమిది కాళ్లతో గొర్రె పిల్ల జన్మించడం స్థానికంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. ఈ వింత జననం చూసిన వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. భోగాపురం మేజర్ పంచాయితీ కేశవ కల్లాలువద్ద నరెడ్ల శివాజీ కోళ్ల ఫారం సమీపంలో అలబాని బంగారికి చెందిన గొర్రె తొలి కాన్పులో ఈ వింత ఆకారంలో ఉన్న గొర్రె పిల్లకు జన్మనిచ్చింది. సాధారణ గొర్రె పిల్లలకు భిన్నంగా ఒకే తల, రెండు శరీరాలు, ఎనిమిది కాళ్లతో ఉండటాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో వింత గొర్రె పిల్లను చూసేందుకు దూర ప్రాంతాల నుంచి సైతం ప్రజలు తరలివచ్చారు.ఇంతటి అరుదైన జననాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ముంజేరు పశువైద్యాధికారి యూత్ రామరాజును 'సూర్య' ప్రతినిధి వివరణ కోరగా.. జన్యుపరమైన లోపాల కారణంగా ఇలాంటి అరుదైన ఆకారాలతో జీవులు జన్మించే అవకాశం ఉంటుందని తెలిపారు.

 రిపోర్టర్: శ్రీనివాస్, భోగాపురం.