న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని వీఆర్ఏల నిరవధిక సమ్మె.
అనపర్తి, మేజర్ న్యూస్. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం అనపర్తి మండల కేంద్రంలో ఈ సమ్మెకు మద్దతుగా ఎమ్మార్పీఎస్ దాసరి రవికుమార్ మాట్లాడుతూ న్యాయపరమైన సమస్యలు వీఆర్ఏలు సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేయడంతోపాటు అర్హత, సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు కల్పించాలని వారు కోరారు. వీఆర్ఏల నుంచి వీఆర్వోలుగా, అలాగే అటెండర్, నైట్ వాచ్‌మన్ తదితర కేడర్లలో అర్హత కలిగిన వారికి పదోన్నతి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగ భద్రత, వేతనాలు, పదోన్నతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా కొనసాగిస్తున్న ఆందోళనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చర్చలకు ముందుకు రావాలని వీఆర్ఏలు విజ్ఞప్తి