నేటి బాలలే రేపటి వికసిత్ భారత్ నిర్మాతలు
సూర్య న్యూస్ దర్శి. నేటి బాలలే రేపటి వికసిద్భారత్ నిర్మాతలని శామంత పూడి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. రవి అన్నారు.
దర్శి మండలం సామంతపూడి మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల నందు జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ప్రధానోపాధ్యాయులు పి రవి పాఠశాలలోని విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి జవహర్లాల్ నెహ్రూ గొప్పదనం, విద్యార్థుల పట్ల నెహ్రూ కి ఉన్న ప్రేమ అభిమానం గురించి వివరించారు. అనంతరం విద్యార్థులకుస్వీట్లు పంచిపెట్టారు.