నెల్లూరు రూరల్ పరిధిలోని హరినాథ్పురంలో ఓటు వేసిన మంత్రి
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : నగరపాలక సంస్థ ఎన్నికల్లో మంత్రి నారాయణ నెల్లూరు రూరల్ హరనాథపురంలోని 25/4 పోలింగ్ బూత్‌లో ఆదివారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ప్రజలందరూ విధిగా ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటు హక్కు మన బాధ్యత అని, ప్రజలకు సేవ చేసేవారికే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని మంత్రి నారాయణ కోరారు.