BREAKING
శ్రీ కోటదుర్గ ఆలయం లో గోడ పత్రిక విడుదల కొత్తపల్లి,రావుపల్లి గ్రామాల అంగన్వాడీ వర్కర్లకు సత్కారం మండల విద్యాశాఖ అధికారులకు ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించిన డీఈవో స్థానిక సంస్థల ఎన్నికలకు స్ట్రాంగ్ రూమ్ పరిశీలన తెగిపోయిన చేతికి మళ్లీ ప్రాణం… పీఎంశ్రీ పాఠశాలల్లో.. ప్రత్యేక అతిథి విద్యాబోధకుల నియామకం ఆటో ద్విచక్ర వాహనం ఢీ ఒకరికి గాయాలు.... చిగురుకోట జడ్పీ హైస్కూల్ ను పరిశీలించిన ఎస్ఎంసి చైర్మన్ దండే లక్ష్మి పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన కనిగిరి చేరిన బ్యాలట్ బాక్స్ లు కోర్టు సినిమా హీరోయిన్ శ్రీదేవి కొత్త చిత్రం హైకూ ట్రైలర్ రిలీజ్.. అక్టోబర్ 23న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్! జోగింపేట గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించిన ఏవో ఎస్ అవినాష్ అయోడిన్ లోపంతో పిల్లల ఎదుగుదలపై ప్రభావం శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో వరుణయాగం వరిలో ఎద పద్ధతితో సాగు ఖర్చు తగ్గుతుంది ... ఏవో ఎస్ అవినాష్.

నెల్లూరు రైల్వే స్టేషన్‌లో పారిశుద్ధ్య కార్మికుల మెరుపు సమ్మె

Select Suryaa Now
నెల్లూరు రైల్వే స్టేషన్‌లో పారిశుద్ధ్య కార్మికుల మెరుపు సమ్మె

నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్   :    నెల్లూరు రైల్వే స్టేషన్‌లో ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా నలుగురు పారిశుద్ధ్య కార్మికులను విధుల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ కాంట్రాక్ట్ కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. కాంట్రాక్టర్ రంగస్వామి తమ ఖాతాల్లో జమైన రూ.18,000 బోనస్‌ను బలవంతంగా వెనక్కి తీసుకోవడంతో పాటు, రెండు నెలలుగా జీతాలు చెల్లించకుండా వ్యక్తిగత పనులకు వాడుకుంటున్నారని, అలాగే సూపర్వైజర్ సురేష్ మహిళా కార్మికులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని కార్మికులు ఆరోపించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం సిఐటియు నాయకులు, న్యాయవాదుల సంఘం ప్రతినిధులతో కలిసి స్టేషన్ మేనేజర్ శివయ్యకు వినతిపత్రం అందజేశారు. తొలగించిన కార్మికులను తక్షణమే తిరిగి విధుల్లోకి తీసుకొని, వారి బోనస్ డబ్బులు చెల్లించే వరకు తమ సమ్మె కొనసాగుతుందని సిఐటియు నాయకులు స్పష్టం చేశారు.