BREAKING
పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి :వైద్యాధికారిని హైమశ్రీ అక్షర సాధన తో అధిరోహించిన శిఖరం పోలీసుల విధులపై చిన్నారులకు అవగాహన సిబ్బంది సేవలు వెలకట్టలేనివి ప్రభుత్వమే పత్తిని కొనుగోలు చేయాలి జిల్లా పరిషత్ చైర్మన్ బి సి అయితే..మాకు అవకాశం ఇవ్వండి.. : చింతా శంకర్ మూర్తి.. ఈవో వర్సెస్.. చైర్మన్ వాడిగా వేడిగా కనకమహాలక్ష్మి ట్రస్ట్ బోర్డు సమావేశం వేయి స్తంభాల దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు బీటెక్ విద్యార్థి ఆత్మహత్య మెరిసే అందమైన చర్మం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు? పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన బాల్యం, బాలికల విద్యకు ప్రాధాన్యమివ్వాలి.. లింగ వివక్షకు తావులేదు ఢిల్లీలో ఉద్రిక్తత: రాహుల్ గాంధీ అదుపులోకి, సంఘీభావానికి వెళ్లిన సీఎం రేవంత్‌ను అడ్డుకున్న పోలీసులు మైనారిటీ గురుకులంలో విద్యార్థిపై దాడి ఆరోపణ జిల్లా పొలిటికల్ అవేర్‌నెస్ చైర్‌పర్సన్‌గా సుదా గణపతి.. రాష్ట్ర స్ట్రాంగ్ మెన్ టైటిల్ విజేత మారే వీరేంద్ర…

నేడు కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పై ప్రభుత్వానికి నివేదిక

Select Suryaa Now
నేడు కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పై ప్రభుత్వానికి నివేదిక

 ఏలూరు,  :  కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గురించి కేంద్ర సాధికార కమిటీ కోరిన అంశాలతో కూడిన తుది సమాచారాన్ని జిల్లా యంత్రాంగం రూపొందించి ఈనెల 7వ తేదీ న రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.  కేంద్ర సాధికార కమిటీ ఆదేశాల ననుసరించి   కొల్లేరు 5వ కాంటూర్ పరిధిలోని అభయారణ్యం సరిహద్దుల హేతుబద్దీకరణ,  జిరాయితీ, డి.ఫారం భూమిదారుల పునరావాసం కార్యక్రమాలు, సంరక్షణ కేంద్రం సరిహద్దుల హేతుబద్ధీకరణ తర్వాత, అన్ని వివరాలతో కూడిన విస్తీర్ణ నివేదిక, అభయారణ్యంలోని జిరాయితీదారుల తరలింపుపై  మండలాల వారీగా తరలింపుపై ప్రతిపాదిత భూముల వివరాలు, జిల్లా మండలాల సరిహద్దులు, ప్రభుత్వ భూములు, జిరాయితీ  భూములు, డి-పట్టా భూములు, ఉప్పెటేరుతో సహా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పక్షుల ప్రాంతాలు, అభయారణ్య పరిధిలో నోటిఫైడ్, నాన్ నోటిఫైడ్ డ్రైన్లు     వంటి  పలు అంశాలపై కేంద్ర సాధికార కమిటి కోరిన సమాచారాన్ని  జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి,   అటవీశాఖ  అధికారి త్రిమూర్తులు రెడ్డి, ఆర్డీఓ లక్ష్మి ప్రసన్న, సంబంధిత మండలాల తహశీల్దార్లతో కలిసి తుది నివేదికను కలెక్టర్ రూపొందించారు. సదరు నివేదికను ఈనెల 7వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం సమర్పించనుంది. సమావేశంలో  ఇంచార్జ్ డిఆర్ఓ ఎం. ముక్కంటి,   ట్రాన్స్కో ఎస్ఈ కె. ఎం. అంబేద్కర్ , తహసీల్దార్లు, రెవిన్యూ, అటవీ శాఖాధికారులు పాల్గొన్నారు.

 న్యూస్ బ్యూరో కె బాలశౌరి, ఏలూరు