BREAKING
బ్రహ్మలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు* ఎస్.రాయవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సోమిరెడ్డి లక్ష్మి నామినేషన్! మాడుగుల జడ్పీటీసీ సభ్యునిగా పుప్పాల లక్ష్మి నారాయణ ప్రమాణ స్వీకారం గోవింద నామస్మరణతో మార్మోగిన ఎస్.రాయవరం! మాకవరపాలెం జడ్పీటీసీగా అల్లు రామనాయుడు ప్రమాణ స్వీకారం క్రీడల్లో పాల్గొనడం వలన మంచి డైరెక్టర్ వ్యాయామం, అభినందించిన ఏ యూ డైరెక్టర్ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆచార్య ఎ. పల్లవి పెనుగొల్లులో చలో ఢిల్లీ పోస్టర్ విడుదల! గెడ్డపాలెంలో వైఎస్సార్‌సీపీ సత్తా చాటిన పీవీఆర్! కోనసీమ జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా గొల్లపల్లి అమూల్య.. హోంమంత్రి అనిత సహకారంతో అభివృద్ధి చేస్తా! కొరుప్రోలు జడ్పీ హైస్కూల్లో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు! ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద పెద్దేరు జలాశయంలో చేప పిల్లల విడుదల కనకమహాలక్ష్మి మార్గశిర ఉత్సవాలకు శ్రీకారం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ దీపాలు అమర్చాలి 38వ వార్డులో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు.

నర్సీపట్నంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు

Select Suryaa Now
నర్సీపట్నంలో జాతీయ  గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు

 
పోటీ పరీక్షల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం.
నర్సీపట్నం, నవంబర్ 20 మేజర్ న్యూస్:. 
జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ఉపసంహారణోత్సవ(ముగింపు) కార్యక్రమం లైబ్రేరియన్ దమయంతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న మండల విద్యాశాఖాధికారులు తలుపులు, నాగేంద్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు, దాతల సహకారంతో చదువరులకు విశేష సేవలు అందిస్తున్న లైబ్రేరియన్ దమయంతిని, ఆమెకు సహకరిస్తున్న ఆమె భర్త ప్రభాకర్ ని వారు అభినందించారు. విజ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రజా విశ్వవిద్యాలయాలుగా భావించబడుతున్న గ్రంధాలయాలకు  పూర్వవైభవం రావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా పాల్గొన్న స్థానిక కళాశాల లెక్చరర్ శర్మ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు హాజరవు తున్న విద్యార్థులకు అవసరమైన విలువైన మెటీరియల్ ని లైబ్రేరియన్ గారి  ద్వారా ఉచితంగా ఎంతమందికైనా అందించగలమని హామీ ఇచ్చారు, అనంతరం వారం రోజులపాటు గ్రంథాలయంలో నిర్వహించబడిన వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు అతిధుల చేతుల మీదుగా బహుమతి ప్రధానం జరిగింది. వారోత్సవాలు ముగింపు సందర్భంగా గ్రంథాలయ అభివృద్ధికి తోడ్పడుతున్న స్థానిక ఎన్టీఆర్ స్టేడియం పుస్తక నిక్షిప్త కేంద్రం కార్యకర్త పి.శ్రీనివాస్ ను, స్థానిక అడ్వకేట్ కె.సతీష్ ను, మండల విద్యాశాఖ అధికారులు తలుపులు, నాగేంద్ర, లెక్చరర్ శర్మ, విశ్రాంత లైబ్రేరియన్ త్రిమూర్తులు లను ఈ సందర్భంగా లైబ్రేరియన్ సన్మానించారు,