నరసాపురం ఎంపీటీసీగా టీడీపీ తరఫున తిరుమలేష్ నామినేషన్..
పరిగి మేజర్ న్యూస్: పరిగి మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా గురువారం నర్సాపురం ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తరఫున యువ నాయకుడు తిరుమలేష్ నామినేషన్ దాఖలు చేశారు. నర్సాపురం ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ఆయన నామినేషన్ సమర్పించారు. యువ నాయకుడిగా తిరుమలేష్ ఎన్నికల బరిలో దిగడంతో నర్సాపురం ఎంపీటీసీ స్థానంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
పరిగి సూర్య రిపోర్టర్ నవీన్