BREAKING
వసతి గృహాలలో దోమతెరలు పంపిణీ అంతర్జాతీయ యుద్ధాల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవే: సీడీఎస్ రాజా సుబ్రమణి! ఎంటీఎంసీ ఎన్నిక కు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి కురుగుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ మద్దతుదారుడు మాధవరెడ్డి నామినేషన్ శేఖర్ రెడ్డి మృతికి ఎమ్మెల్యే సంతాపం చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన రైలు బోగీలు ఆప్యాయ పలకరింపు.. ఆత్మీయ పరామర్శ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కోటి సోమవారము కాకాని శివయ్య సన్నిధిలో పోటెత్తిన భక్తులు--- వివిధ సేవా రుసుములు ద్వారా రూ.9,25,000/- ఆదాయము. సింహాన్ని బైకులతో తరిమిన ఘటన: ముగ్గురు అటవీ సిబ్బంది తొలగింపు! ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి మహా కుంభాభిషేక మహోత్సవం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి "వాగ్దానాల వర్షం.. అమలులో కరువు!" రైతు బతుకు బాగుపడేదెప్పుడు? హామీలు నెరవేరేదెప్పుడు? రైతు కన్నీటికి బాధ్యులెవరు? రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ కేశంనేనిపల్లి నుంచి 20 కుటుంబాలు బీఆర్ఎస్‌లో చేరిక పలమనేరు శివాలయంలో ప్రత్యేక పూజలు ఇంకెన్నాళ్లు వైసీపీ దౌర్జన్యాలను చూస్తూ ఉండాలి-- జైలు వద్ద పోలీస్ అధికారులపై దాడి అత్యంత హేయం-- గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్

నకరికల్లులో విత్తనాల దుకాణంపై వ్యవసాయ అధికారుల ఆకస్మిక తనిఖీ.

Select Suryaa Now
నకరికల్లులో విత్తనాల దుకాణంపై వ్యవసాయ అధికారుల ఆకస్మిక తనిఖీ.

నకరికల్లు మేజర్ న్యూస్:  
 మండల కేంద్రంలోని ఎన్. చిన్నయ్య అండ్ సన్స్ విత్తనాల దుకాణాన్ని మండల వ్యవసాయ అధికారి కే. దేవదాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణానికి సంబంధించిన గోదాములోని విత్తన నిల్వలు, బిల్లుబుక్కులు, స్టాక్ రిజిస్టర్, స్టాక్ బోర్డులను పరిశీలించారు.
గోదాములో భౌతికంగా నిల్వ ఉన్న విత్తనాలను తనిఖీ చేసి నాలుగు నమూనాలను సేకరించారు. వాటిని నాణ్యతా పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించినట్లు వ్యవసాయ అధికారి తెలిపారు.
ఈ సందర్భంగా కే. దేవదాస్ మాట్లాడుతూ రైతులు వ్యవసాయ శాఖ నుంచి లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా విక్రయ రసీదు తీసుకోవాలని, రసీదుపై పంట రకం, లాట్ నంబరు, అమ్మిన వారి సంతకం, కొనుగోలు చేసిన వారి సంతకం ఉండేలా చూసుకోవాలని తెలిపారు. నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని డీలర్లను హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఈఓ కే. దిలీప్ కుమార్, గ్రామ వ్యవసాయ సహాయకుడు వై. ప్రభాకర్, దుకాణ సిబ్బంది పాల్గొన్నారు.