BREAKING
అర్నాబ్ తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికలు శాంతియుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు పోటుమెరక గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 2 పోలింగ్ స్టేషన్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అర్నబ్ తీవ్ర తుఫాన్ దృష్ట్యా తీర ప్రాంతంలోని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి స్థానిక ఎన్నికల ఘటనలపై ఎస్ఈసీ విచారణ చేయించాలి - మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హ్యాండ్లూమ్ హౌస్ డైరెక్టర్‌గా కర్నాటి వజ్రమ్మ ఏకగ్రీవ ఎన్నిక వెల్దుర్తి మండలం: బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలు అన్నారం వద్ద రోడ్డు ప్రమాదం: బైక్‌ను కట్ చేస్తూ ఢీకొట్టిన ఇసుక లారీ.. యువకుడికి తీవ్ర గాయాలు! సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం:కాంగ్రెస్ పార్టీ పరిగి మండల అధ్యక్షుడు వెంకట్ రాములు మర్రిపాడు ఎంపీపీ పీఠం టీడీపీ కైవసం - చక్రం తిప్పిన పుట్టం సోదరులు - 7 ఎంపీటీసీలు ఏకగ్రీవం ఆత్మకూరులో ఆనం వ్యూహం - మలుపు తిరిగిన రాజకీయం - బొమ్మిరెడ్డి రంగ ప్రవేశం - విజయ పదంలో స్థానికం తుఫానుతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..తహశీల్దార్ నరేశ్ వేమవరంలో టీడీపీ అభ్యర్థి మాదల ఝాన్సీ లక్ష్మీ భాయ్ ఇంటింటి ప్రచారం బోగోలు ఎంపీటీసీ బరిలో 23 మంది పోటీకి సిద్ధం - ముగ్గురు ఏకగ్రీవంగా ఎంపిక ముండ్లమూరి జడ్పిటిసి ఎన్నికల బరిలో ముగ్గురు.

నామినేషన్లపై పిటిషన్లు వేసుకోవచ్చు

Select Suryaa Now
నామినేషన్లపై పిటిషన్లు వేసుకోవచ్చు

సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఏపీ స్టేట్ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి

మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారని భావించే అభ్యర్థులు తగిన ఆధారాలతో చట్టప్రకారం ఎన్నికల పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.గత విచారణలో ఇచ్చిన ఆదేశాల అమలుపై రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం తమ నివేదికలను కోర్టుకు సమర్పించాయి. నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పించలేదని, పలుచోట్ల తమ పార్టీ అభ్యర్థులను అడ్డుకున్నారని వైఎస్సార్‌సీపీ తరఫు న్యాయవాదులు వాదించారు. మరోవైపు, కోర్టు ఆదేశాల మేరకు నామినేషన్ల గడువును పొడిగించామని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వివరించారు.ఫిర్యాదులు అందిన ప్రాంతాల్లో పరిశీలన జరిపి వివరాలు సమర్పించాలని గతంలో సూచించిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. నామినేషన్ల వివాదాలను పరిష్కరించుకునేందుకు చట్టపరమైన మార్గాలను అనుసరించాలని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియను హైకోర్టు రోజువారీగా పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేసే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది.

ఎం.గణేశ్, బ్యూరో ఇన్చార్జి, ఏపీ