BREAKING
భీమవరం రైల్వే స్టేషన్‌లో 7.5 కిలోల గంజాయి స్వాధీనం ముగ్గురు మహిళల అరెస్ట్ జిల్లా విద్యా శాఖ అధికారిని కలిసిన సోమిరెడ్డి రాజు! సిఎం రేవంత్ రెడ్డికి అలంపూర్ శ్రీ జోగుళాంబ అమ్మవారి కల్యాణోత్సవ ఆహ్వానం ట్రేడ్స్‌మెన్ సమస్యలు పరిష్కరించాలి- ఏఐటీయూసీ గీత కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి భారత బ్యాటర్ల విధ్వంసం: విండీస్ ఎదుట 250 పరుగుల భారీ లక్ష్యం జనగణన–2027 ఏర్పాట్లపై రాష్ట్రస్థాయి సమావేశం కొణతాలను కలిసిన నూతన డిపిఓ ఆంక్షల గుప్పెట్లో హస్తిన.. అడుగడుగునా పోలీసులు పేకాట స్థావరంపై పోలీసులు దాడి. ఇంకొల్లు సభలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ •ఇంకొల్లు, నాగండ్ల, పావులూరులో రూ.25 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు •అభివృద్ధికి తొలి ప్రాధాన్యం... ఎమ్మెల్యే ఏలూరి గ్రామాల సమగ్ర అభివృద్ధికి పల్లె పండగతో శ్రీకారం అభివృద్ధి పనులతో కళకళలాడుతున్న నియోజకవర్గంలోని గ్రామాలు * భీమవరం మండలంలోని వెంప, శ్రీరామపురం, తుందుర్రు, బేతపూడి కరుకువాడ గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు ఊరు ఊరుకో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ ఉత్సవాలు *ఎర్రకాలువ మిగులు భూముల్లో సాగు చేస్తున్న భూములకు రక్షణ కల్పించాలి* *సాగు భూముల్లో పశువులతో పంటను ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి*

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చిలకలూరిపేటలో పోలీసుల సాయుధ కవాతు 150 మంది పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

Select Suryaa Now
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చిలకలూరిపేటలో పోలీసుల సాయుధ కవాతు 150 మంది పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

చిలకలూరిపేట మేజర్ న్యూస్: 

రాబోయే మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు,పట్టణంలో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు పోలీసులు సాయుధ కవాతు నిర్వహించారు.పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ ఆదహళ్లి ఆదేశాలు,సూచనల మేరకు శుక్రవారం సాయంత్రం ఈ కార్యక్రమం చేపట్టారు.చిలకలూరిపేట టౌన్ సీఐ పి. రమేష్ నేతృత్వంలో సుమారు 150 మంది ప్రత్యేక పోలీసు బలగాలు ఈ కవాతులో పాల్గొన్నాయి.పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్ నుంచి ప్రారంభమైన కవాతు చౌత్రా సెంటర్,కళామందిర్ సెంటర్ మీదుగా అడ్డరోడ్డు వరకు కొనసాగింది.పట్టణంలోని సున్నితమైన,అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు కవాతు నిర్వహించి ప్రజలకు భద్రతపై భరోసా కల్పించారు.రానున్న మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. ఎన్నికల ప్రక్రియలో ప్రజలు ఎలాంటి భయం,ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందనే సందేశాన్ని ఈ కవాతు ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు.ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకుండా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, పట్టణంలో పోలీసుల నిఘా కొనసాగుతుందని ఈ కార్యక్రమం ద్వారా స్పష్టం చేశారు.ఈ కవాతులో టౌన్ సీఐ పి. రమేష్‌తో పాటు ఎస్ఐలు సోమేశ్వరరావు,హాజరత్తయ్య,టౌన్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.