గ్రామాల సమగ్ర అభివృద్ధికి పల్లె పండగతో శ్రీకారం అభివృద్ధి పనులతో కళకళలాడుతున్న నియోజకవర్గంలోని గ్రామాలు * భీమవరం మండలంలోని వెంప, శ్రీరామపురం, తుందుర్రు, బేతపూడి కరుకువాడ గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు
భీమవరం సూర్య న్యూస్ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంతో గ్రామాలు సరికొత్త అభివృద్ధి పనులతో కళకళలాడుతున్నాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. శుక్రవారం భీమవరం మండలం వెంప, శ్రీరామపురం, తుందుర్రు, బేతపూడి పంచాయతీ కరుకువాడ గ్రామంలో పల్లె పండగ 3.0 లో భాగంగా పలు సీసీ రోడ్లకు శంకుస్థాపన, పలు రోడ్లను ఎమ్మెల్యే అంజిబాబు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి శ్రీరామపురంలో మైక్రో వాటర్ ప్లాంట్ ను, ప్రాధమిక పాఠశాల భవనంను వారు ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో కొత్తగా సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్లు, అధునాతన డ్రైనేజీ వ్యవస్థలను నిర్మిస్తున్నామని, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల సమగ్ర అభివృద్ధికి పల్లె పండగతో శ్రీకారం చుట్టమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరచడానికి ప్రభుత్వం ఏకంగా రూ. 11,085 కోట్ల భారీ నిధులను కేటాయించిందని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ పల్లె పండుగ 3.0లో గ్రామాలు సంపూర్ణంగా అభివృద్థి చెందుతాయని, కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే పల్లె పండుగ ద్వారా మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టామన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు పాల్గొన్నారు.
శ్రీనివాస్ భీమవరం పశ్చిమగోదావరి జిల్లా