వైఎస్సార్‌సీపీకీ కార్యకర్తలే ప్రధాన బలం
- కార్యకర్తల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత
- వైకాపా సమన్వయకర్త ఎస్.నిసార్ అహ్మద్ వెల్లడి
- కొత్తపల్లిలో ఘనంగా కార్యకర్తలకు గుర్తింపు కార్డుల పంపిణీ
మదనపల్లె : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే వెన్నెముకని,పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తల సంక్షేమం,భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని మదనపల్లె నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ ఎస్.నిసార్ అహ్మద్ అన్నారు.పార్టీ గుర్తింపు కార్డులు కలిగిన కార్యకర్తలకు రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.మదనపల్లె మండలం,కొత్తపల్లి గ్రామంలో వైకాపా మండల ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి మహేశ్ ఆధ్వర్యంలో కార్యకర్తలకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్.నిసార్ అహ్మద్ హాజరుకాగా,వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్. రెడ్డి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రజల మధ్య ఉంటున్న కార్యకర్తలకు గుర్తింపు,భద్రత కల్పించడం ముఖ్యమన్నారు.పార్టీ జెండాను మోస్తూ,ప్రజల సమస్యలపై పోరాడే కార్యకర్తలకు అండగా నిలవడమే మా లక్ష్యమని,గుర్తింపు కార్డు కార్యకర్తకు పార్టీతో ఉన్న అనుబంధానికి ప్రతీక,దీనితోపాటు రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం కార్యకర్తల సంక్షేమానికి ఇచ్చే ప్రాధాన్యతను తెలియజేస్తుందని పేర్కొన్నారు.క్రమశిక్షణ,ఐక్యత,సమన్వయంతో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్.రెడ్డి మాట్లాడుతూ గుర్తింపుకార్డు గుండెలపైన,పార్టీ పట్ల నిబద్ధత గుండెలోన ఉండాలని,నిఖార్సైన కార్యకర్తలకే గుర్తింపు కార్డులు ఇవ్వడం జరిగిందని గ్రామాలలోని ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలపై నిరంతరం గొంతు వినిపించాలన్నారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని కోరారు.మాజీ కౌన్సిలర్ ప్రసాద్ బాబు మాట్లాడుతూ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యకర్తలకు ప్రత్యేక గుర్తింపునివ్వడంతోపాటు పార్టీ శ్రేణులను క్రమబద్ధీకరించేందుకు దోహదపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి సి.పి.రాఘవ రెడ్డి,నాయకులు శీలం రమేష్,ఈశ్వర్ నాయక్,శంకర్ నాయక్,బయ్యారెడ్డి,యూనస్,చిప్పిలి మల్లికార్జున రెడ్డి,హబీబ్,ఆటో ఫయాజ్,మాధవ రెడ్డి,సాంబశివా రెడ్డి,సోమశేఖర్ రెడ్డి,చెన్నకృష్ణ,మాలేపాడు చలపతి,బస్రీ,నాగమణి,షేక్ షమ,గ్రామ కమిటీ అధ్యక్షురాలు రేఖ,పి.వాసు,దయాకర్ రెడ్డి,విజయలక్ష్మి,నవీన్ సాయి,సందీప్,రమణ,హెచ్.రమేశ్,కమలాకర్,బాలకృష్ణ,మాలేపాడు హరి,హరిత,సురేంద్ర,సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.