BREAKING
ముస్లిం మైనార్టీలకు రెండు నామినేటెడ్ పదవులు -- ఎమ్మెల్యే బడేటి చంటి హామీ 19వ వార్డులో విద్యార్థులకు నూతన వస్త్రాల పంపిణీ సంజూ ధనాధన్ 82, శ్రేయస్ మెరుపులు.. విండీస్‌ బౌలర్లను ఉతికేసిన టీమిండియా ఉచిత సంతాన సాఫల్య శిబిరానికి విశేష స్పందన ఆస్తి వివరాలు చెప్తేనే ప్రమోషన్ మేయర్ సీటు తో సహా 62 డివిజన్లు గెలుచుకుంటాం -- టిడిపి జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్యే బడేటి చంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కంటే ఎక్కువ సీట్లు ఇస్తామని ప్రకటించిన టిడిపి హర్షం వ్యక్తం చేస్తున్న నాయకులు విశ్వం సీబీఎస్ఈ పాఠశాలలో ఘనంగా స్పోర్ట్స్ మీట్ 2కే ఆగిరిపల్లి ఎస్‌డబ్ల్యూపీసీలో గ్రీన్ అంబాసిడర్లకు శిక్షణ --తడి చెత్తతో వర్మీ కంపోస్ట్ తయారీపై అవగాహన ‘జైలర్-2’ చిత్రానికి ఏపీ ప్రభుత్వ వెసులుబాటు: టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదుకు భారీగా దరఖాస్తులు గద్వాల్ విజయలక్ష్మి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కు హైకోర్టులో ఊరట ఘనంగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఓట్ల చోరీకి పాల్పడ్డారని ఆరోపణలు.. ఎన్నికల కమిషనర్ రాజీనామాకు SFI డిమాండ్ ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని భీమవరంలో నిరసన

*ఎర్రకాలువ మిగులు భూముల్లో సాగు చేస్తున్న భూములకు రక్షణ కల్పించాలి* *సాగు భూముల్లో పశువులతో పంటను ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి*

Select Suryaa Now
 *ఎర్రకాలువ మిగులు భూముల్లో సాగు చేస్తున్న భూములకు రక్షణ కల్పించాలి*   *సాగు భూముల్లో పశువులతో పంటను ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి*

టి.నర్సాపురం, సూర్య న్యూస్-గిరిజనుల పంట భూములను నాశనం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు పంట భూముల్లో భూస్వాములు పంటను ధ్వంసం చేసిన భూముల పర్యటించి, పంట పొలాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ గిరిజనులు సాగు చేసుకుంటున్నా పంట పొలాల్లో పశువులను మేపడం చట్టరీత్యా నేరం అన్నారు. వేలకు వేలు పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేస్తున్న నేపథ్యంలో గిరిజనుల పంటను ధ్వంసం చేయడంతో పాటు గరిజనులపై దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు కట్టి శిక్షించాలన్నారు. చట్టాలను అమలు చేయాల్సిన అధికారులే చట్టాల ధిక్కరించి భూస్వాములకు వత్తాసులు పలకడం దుర్మార్గమన్నారు. గిరిజన భూముల జోలికొస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గిరిజనులు వ్యవసాయంలో బొబ్బర్లు, వరి వంటి పంటలను ధ్వంసం చేయడంతో పాటు దాడి చేయడం చట్టరీత్యా నేరమని గుర్తింపజేశారు. ఇప్పటికే గిరిజనులపై దాడి చేసిన నేపథ్యంలో టీ. నర్సాపురం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన నేటికీ వారి పైన చర్యలు తీసుకోపోవటం సిగ్గుచేటు అన్నారు. గిరిజనులకు చట్టాలు వర్తించవా అని ప్రశ్నించారు. గిరిజన భూములకు రక్షణ కల్పించకపోవడంతో పాటు గిరిజనులను దాడి చేసి ఇబ్బందులు గురి చేస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలోని అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజన భూములను ఇలాగే ధ్వంసం చేస్తూ పోతుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధమవుతామని హెచ్చరించారు. రాబోయే కాలంలో జరిగే పరిణామాలకు  ప్రభుత్వం, అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు సిరమయ్య, పార్వతి, రామలక్ష్మి, చెల్లమ్మ, భూ పోరాట నాయకులు దుర్గమ్మ, రామలక్ష్మి, చెల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

 జిల్లా ఇంచార్జ్ పసుమర్తి  రాము ఏలూరు