సంజూ ధనాధన్ 82, శ్రేయస్ మెరుపులు.. విండీస్ బౌలర్లను ఉతికేసిన టీమిండియా
రాంచీ వేదికగా వెస్ట్ ఇండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత బ్యాటర్లు రికార్డు స్థాయి విస్ఫోటనం సృష్టించారు. సంజూ శామ్సన్ 82 పరుగులు, ఈషాన్ కిషన్ 43 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 40 పరుగుల మెరుపులతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగుల భారీ స్కోరు సాధించింది.
విండీస్‌కు 250 పరుగుల కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది.