ఉచిత సంతాన సాఫల్య శిబిరానికి విశేష స్పందన
- అధిక సంఖ్యలో హాజరైన సంతానం లేని దంపతులు
- హాజరైన ప్రముఖ వైద్యులు చింతంరెడ్డి ఉమాదేవి,అర్చన కార్తీక్
మదనపల్లె : అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణం,విజయభారతి పాఠశాల పక్కన గల ఉమాదేవి ఆసుపత్రి ఆధ్వర్యంలో సంతాన సాఫల్య సమస్యలపై శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించినట్లు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ చింతంరెడ్డి ఉమాదేవి పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బెంగళూరులో ప్రఖ్యాతి గాంచిన గైనకాలజిస్ట్ డాక్టర్ అర్చన కార్తీక్ (ఎంబీబీఎస్,డిజిఓ,డి.ఎన్.బి,ఎఫ్ఆర్ఎం,ఎఫ్ఐసిఓజి,ఐవీఎఫ్ స్పెషలిస్ట్) పాల్గొని సంతానం లేని దంపతులకు పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు.దీర్ఘకాలంగా సంతానం పొందని దంపతులు,40 సంవత్సరాలు దాటిన వారు,ట్యూబ్స్ మూసుకుపోయిన వారు,తరచుగా గర్భస్రావం అయ్యేవారు,పురుషుల్లో వీర్యకణాల లోపం ఉన్నవారు,అలాగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనంతరం తిరిగి గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి సూచనలు సలహాలు అందజేయడం జరిగిందన్నారు.ఓపి,స్కానింగ్,పురుషులకు ఉచిత వీర్య పరీక్షలు ఉచితంగా చేయబడ్డాయన్నారు.ఇందులో భాగంగా ఐయుఐ,ఐవిఎఫ్,ఐసిఎస్ఐ,ఐఎంఎస్ఐ వంటి సంతాన సాఫల్య చికిత్సలకు సంబంధించిన వైద్య సలహాలు అందించినట్లు తెలిపారు.ఉచిత సంతాన సాఫల్య శిబిరానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిందన్నారు.గతంలో సంతానం లేని దంపతులు తిరుపతి,చెన్నై,హైదరాబాద్,బెంగళూరు వంటి నగరాలకు వెళ్లి పరీక్షలు,చికిత్సలు చేయించుకునే వారన్నారు.ఇప్పుడు మదనపల్లి,అన్నమయ్య జిల్లాలో సంతానం లేని వారికి ఆ ఇబ్బంది లేదన్నారు.ప్రస్తుతం మదనపల్లి ఉమాదేవి ఆసుపత్రిలో తరచుగా ఉచిత సంతాన సాఫల్య శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు.ప్రజలకు అతి తక్కువ ఖర్చులతోనే సంతానం పొందే వెసలుబాటు కల్పిస్తున్నామని డాక్టర్ చింతంరెడ్డి ఉమాదేవి స్పష్టం చేశారు.
కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లె నియోజకవర్గం ఇంచార్జి