పేకాట స్థావరంపై పోలీసులు దాడి.
కళ్యాణదుర్గం టౌన్ ప్రతినిధి రంగస్వామి.
కళ్యాణదుర్గం రూరల్ మండలంలోని ఈస్ట్ కోడిపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.38,400 నగదు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామ శివారులోని ముళ్ల పొదల మధ్య పేకాట ఆడుతున్నారనే సమాచారంతో కళ్యాణదుర్గం రూరల్ ఇన్‌స్పెక్టర్ ఎ. గంగాధర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఏడుగురిని పట్టుకుని, వారి వద్ద ఉన్న నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తుల వివరాలను నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఇలాంటి కార్యకలాపాల గురించి సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని ఇన్‌స్పెక్టర్ ఎ. గంగాధర్ విజ్ఞప్తి చేశారు.