ఊరు ఊరుకో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు
ఊరు ఊరికో జమ్మి చెట్టు. గుడి గుడికో జమ్మి చెట్టు
శ్రీవారాహి దేవి అమ్మవారి ఆవరణలో
మొక్కలు నాటిన జోగినపల్లి సంతోష్
కుకునూరుపల్లి, మేజర్ న్యూస్.....ఊరు ఊరికో జమ్మి చెట్టు. గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా కుకునూరుపల్లి శ్రీవారాహి సమేత ప్రత్యంగిరా దేవి శరవేశ్వర స్వామి దేవాలయంలో ఆవరణలో శుక్రవారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్పాల రామేశ్వరరావు, పిఎసిఎస్ వైస్ చైర్మన్ అమరేందర్ ఆధ్వర్యంలో
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ రావు చేతుల మీదుగా దేవాలయంలో జమ్మి చెట్టు నాటారు. అనంతరం దేవాలయంలో వారాహి ట్రస్ట్ చైర్మన్ మమతమ్మ ఆధ్వర్యంలోప్రత్యేక పూజలు నిర్వహించి వారికి ప్రత్యేక వేద ఆశీర్వచనం ఇచ్చారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి గజ్వేల్ బీఆర్ఎస్ ఇంచార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి బట్టు అంజి రెడ్డి పిఎన్ఆర్ ట్రస్ట్ చైర్మన్ పి నరేందర్, దేవి రవీందర్ అనంతుల ప్రశాంత్ కోల సద్గుణ రవీందర్ జుబేర్ సంపత్ కుకునూరుపల్లి మండల సర్పంచులు ముఖ్య నాయకులు వారాహి అమ్మ భక్తులు కుకునూరుపల్లి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.