BREAKING
ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సమక్షంలో వైకాపాని వీడి తెదేపాలో చేరిక ప్రతిష్టాత్మకమైనా... ప్రశాంతంగానే ముగిసిన ఎస్.రాయవరం హైస్కూల్ ఎన్నికలు! డిజిటల్ విధానంలో ఎరువుల విక్రయాలు – ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌పై అవగాహన కార్యక్రమం* ప్రపంచ బ్యాంకు సమావేశాలకు గైర్హాజరుకానున్న అమెరికా ఆర్థిక మంత్రి బెసెంట్ 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం తెలంగాణ టూరిజానికి ఐటీ చేయూత ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్తగా జయమంగళ -- జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఎమ్మెల్సీ కృతజ్ఞతలు వైఎస్సార్‌సీపీకీ కార్యకర్తలే ప్రధాన బలం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపై అమెరికా తీవ్ర ఆంక్షలు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తల్లిదండ్రులే మార్గదర్శకులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు అమెరికా సైనిక స్థావరంలోకి చొరబాటు కలకలం ఆక్వా ఎక్స్ పోను సందర్శించిన కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ఎమ్మెల్యే ముత్తుముల జన్మదినం సందర్భంగా విద్యార్థులకు విద్యా కానుక!

ఇంకొల్లు సభలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ •ఇంకొల్లు, నాగండ్ల, పావులూరులో రూ.25 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు •అభివృద్ధికి తొలి ప్రాధాన్యం... ఎమ్మెల్యే ఏలూరి

Select Suryaa Now
ఇంకొల్లు సభలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ •ఇంకొల్లు, నాగండ్ల, పావులూరులో రూ.25 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు •అభివృద్ధికి తొలి ప్రాధాన్యం... ఎమ్మెల్యే ఏలూరి

ఇంకొల్లు:

రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ ప్రజలకు పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు చేపడుతోందని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రైతుల భూ హక్కులను పరిరక్షిస్తూ, వారి ఆత్మగౌరవాన్ని కాపాడేలా రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలను అందిస్తున్నామని చెప్పారు. పర్చూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం పట్టుదలతో పనిచేస్తున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై మంత్రి ప్రశంసల వర్షం కురిపించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఏలూరి నీతి, నిజాయతీ, క్రమశిక్షణకు ప్రతిరూపమని కొనియాడారు. పర్చూరును అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇంకొల్లు మండల పరిధిలోని ఇంకొల్లు, నాగండ్ల, పావులూరు గ్రామాల్లో సుమారు రూ.25 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రారంభోత్సవాలు నిర్వహించారు.

రెవెన్యూ సంస్కరణల్లో నూతన అధ్యాయం...

సభలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో పట్టాదారు పాసుపుస్తకాలపై అప్పటి ముఖ్యమంత్రి చిత్రాలను ముద్రించి రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని విమర్శించారు. భూ హక్కులకు సంబంధించిన చట్టాలపై రైతుల్లో ఆందోళనలు, వివాదాలు నెలకొన్నాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల హక్కులకు భరోసా కల్పించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టిందన్నారు.
రైతులకు అందించే పట్టాదారు పాసుపుస్తకాలపై వ్యక్తుల చిత్రాలను తొలగించి, రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో అందిస్తున్నామని తెలిపారు. భూ రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడంతో పాటు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి నెలా 9వ తేదీన గ్రామసభల రూపంలో నిర్వహిస్తున్న ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమం ద్వారా ప్రజల భూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం లో రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణలు వేగంగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన భూ చట్టాల కారణంగా తలెత్తిన సమస్యలను పరిష్కరించి, రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈనాం భూముల సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చించామని, రానున్న రోజుల్లో రాజ్యాంగబద్ధంగా, పారదర్శకంగా పేదలకు ప్రయోజనం కలిగేలా పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు.

ఏలూరి పట్టుదల అభినందనీయం

పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సేవలను మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రైతు కుటుంబంలో పుట్టి, సామాన్య ప్రజల కష్టాలను అర్థం చేసుకున్న నాయకుడిగా ఏలూరి ప్రజల కోసం పనిచేస్తున్నారని అన్నారు. నీతి, నిజాయతీ, క్రమశిక్షణకు ఆయన మరో పేరని ప్రశంసించారు. పట్టు వదలని విక్రమార్కుడిలా పర్చూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.
రోడ్లు, సీసీ రహదారులు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణంతో పాటు అనేక మౌలిక సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అర్హులైన పేదలకు సుమారు రూ.22 కోట్ల మేర సాయం అందేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు.
పర్చూరు నియోజకవర్గ అభివృద్ధికి తామంతా అండగా ఉంటామని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి, గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచే కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

పేదల సంక్షేమానికి పెద్దపీట

ప్రతి నెలా ఒకటో తేదీన తెల్లవారుజాము నుంచే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేపడుతున్నామని మంత్రి తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఈ పథకం ఎంతో ఆసరాగా నిలుస్తోందన్నారు. అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు సకాలంలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యాకిట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, తల్లికి వందనం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మెగా డీఎస్సీ నిర్వహించామని, మరో మెగా డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను రాజకీయ విమర్శల పేరుతో మానసికంగా ఇబ్బంది పెట్టడం సరికాదని వ్యాఖ్యానించారు.ముస్లిం సోదరుల పవిత్ర హజ్ యాత్రకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.


అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యం..

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి అనగాని తెలిపారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని విమర్శించారు. ప్రస్తుతం అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలనకు సమ ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ భావితరాలకు మెరుగైన భవిష్యత్తు అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.ఇంకొల్లు మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల మెరుగుదలకు దోహదపడతాయని నాయకులు పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి, అర్హత మేరకు పరిష్కార చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే ఏలూరి

ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ.. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, తన సోదరుడు అనగాని సత్యప్రసాద్ ఇంకొల్లు ప్రాంతానికి రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వానికి భిన్నంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఉపయోగపడే సంస్కరణలను అమలు చేస్తున్నారని చెప్పారు.
పర్చూరు నియోజకవర్గంలో భూ సమస్యలతో పాటు వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. ఏ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లినా బాధ్యతగా స్పందిస్తూ పరిష్కారానికి కృషి చేస్తున్నారని అనగాని సత్యప్రసాద్‌ను ఉద్దేశించి ప్రశంసించారు. గత రెండు రోజులుగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు.
ఇంకొల్లు గ్రామంలో సీసీ రహదారులు, డ్రైనేజీలు సహా అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

పూల వర్షం... జననీరాజనం..

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. పూలవర్షం కురిపిస్తూ, బాణసంచా కాలుస్తూ, జయజయధ్వానాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. నాగండ్లలో మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరి ఎడ్లబండిపై ప్రదర్శనలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వెంకటేశ్వరస్వామి ప్రతిమను అందజేసి, శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుంజి వెంకటరావు, మండల టీడీపీ అధ్యక్షుడు నాయుడు హనుమంతరావు, పోద వీరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి నక్కల రాఘవ , కరి శ్రీనివాసరావు,నరహరి శ్రీనివాసరావు, సుబ్బారావు, సురేష్, సాంబయ్య రామకృష్ణ, శివాజీ, మార్క్ ,స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.