మున్సిపల్ చైర్మన్ టిడిపి అభ్యర్థిగా కూన ప్రమీల నామినేషన్
ఆమదాలవలస, నవంబర్ 16, మేజర్ న్యూస్
ఆమదాలవలస మున్సిపాలిటీ చైర్ పర్సన్ టిడిపి అభ్యర్థిగా స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ సతీమణి కూన ప్రమీల సోమవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు ఆమెకు మద్దతుగా నిలిచి నామినేషన్ వేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి పెద్దపేట వేసేందుకు కూటమి బలపరిచిన అభ్యర్థిని గెలిపించేందుకు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఈ సందర్భంగా ప్రమీల తెలిపారు. మున్సిపాలిటీలో 28 వార్డుల్లో కూటమి బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులకు ఓటర్లు తమ మద్దతును అందజేయాలని తెలియజేశారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ నాయకత్వంలో మున్సిపాలిటీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.