BREAKING
ఎన్నికల స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ ను తనిఖీ చేసిన ఎన్నికల జనరల్ అబ్జర్వర్ ఐదు సొసైటీల్లో పదవుల భర్తీపై ఆసక్తి.. సామాజిక సమీకరణాల చుట్టూ చర్చలు చికిత్స పొందుతూ వ్యక్తి మృతి డీసీఎం ఢీ కొట్టిన ఘటనలో మృత్యు ఒడిలోకి మూడో వ్యక్తి హెచ్‌ఐవీ నియంత్రణలో 95-95-95 లక్ష్యాల సాధనకు ప్రత్యేక కార్యాచరణ* *మొదటి రెండు లక్ష్యాలను 100 శాతానికి చేర్చేలా చర్యలు చేపట్టాలి* *మొబైల్ ఐసీటీసీ వాహనాల ద్వారా విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలి* *జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి* స్వర హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం గురువే సమాజ ప్రగతికి పునాది 'ఫీల్ గుడ్' చిత్రం నుండి యూత్‌ఫుల్ మెలోడీ 'మమ్మా మియా' పాట విడుదల జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ 125 రోజులు పని పొందాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా శివపూర్ గ్రామంలో ఘనంగా వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం - చైర్మన్ నాగం గంగారం మూడు నామినేషన్లు తిరస్కరణ రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలో పీఎం రాహత్ పథకం కీలక పాత్ర పోషిస్తుంది : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మృత సర్పంచ్ కుటుంబానికి అండగా ఉంటా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పరిషత్తు పోరు"నామినేషన్" సక్రమం...ఇక అసలైన సమరం! కీర్తి సురేష్, రాధికా ఆప్టేల ‘అక్క’ ట్రైలర్ విడుదల: అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల విద్యార్థులు మాదాకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

ముక్కంటి కి వైభవంగా వైభవంగా అన్నాభిషేకం అంకురార్పణతో ప్రారంభమైన తొండవాడ రుద్ర పాదాల ముక్కోటి ఉత్సవాలు.

Select Suryaa Now
ముక్కంటి కి వైభవంగా వైభవంగా అన్నాభిషేకం అంకురార్పణతో ప్రారంభమైన తొండవాడ రుద్ర పాదాల ముక్కోటి ఉత్సవాలు.

తిరుపతి, రెవెన్యూ, మేజర్ న్యూస్.

ముక్కంటికి వైభవంగా అన్నాభిషేకం అంకురార్పణతో ప్రారంభమైన తొండవాడ రుద్రపాదాల ముక్కోటి ఉత్సవాలు

తొండవాడ: చంద్రగిరి మండలం తొండవాడలోని ముక్కోటి క్షేత్రంలో రుద్రపాదాల ముక్కోటి ఉత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్త మొగిలి ఇందుమౌళి రెడ్డి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు అంకురార్పణతో శ్రీకారం చుట్టారు.

ఉత్సవాల ప్రారంభ సూచికగా శనివారం ఉదయం మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ మహాగణపతి హోమం నిర్వహించి, శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగించారు.

సాయంత్రం శ్రీ వళ్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఊరేగింపు భక్తిశ్రద్ధలతో సాగింది.
అంతకుముందు శ్రీ ఆనందవల్లి అమ్మవారికి, శ్రీ అగస్త్యేశ్వర స్వామివారికి విశేషంగా అన్నాభిషేకం నిర్వహించారు. స్వామివార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పలువురు  శివ భక్తులు పాల్గొన్నారు.

రుద్రపాదాల ముక్కోటి ఉత్సవాలను పురస్కరించుకుని వివిధ ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. దుబాయ్‌కు చెందిన కౌశిక్ శ్రీపతి పండితారాధ్యులు, కార్తీక్ శ్రీపతి పండితారాధ్యులు లలిత సంగీత కార్యక్రమంతో భక్తులను అలరించారు. శ్రీ విభీషణ శర్మ శ్రీ అగస్త్యేశ్వర స్వామివారి వైభవంపై ధార్మికోపన్యాసం చేశారు.
మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ ధర్మకర్త మొగిలి ఇందుమౌళి రెడ్డి తెలిపారు.

కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి