ముగిసిన జీవిత నైపుణ్యాలపై శిక్షణ
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : పద్మావతి మహిళా వర్సిటీ విద్యార్థి వ్యవహారాల విభాగం ఆధ్వర్యంలో నూతనంగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు మూడు రోజులు పాటు జీవిత నైపుణ్యాలపై శిక్షణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా ముగిసింది. విద్యార్థినులు తమ విద్యా, వ్యక్తిగత, సామాజిక జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన జీవన నైపుణ్యాలను పెంపొందించడం, వారి సమగ్ర అభివృద్ధికి తోడ్పడడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని విద్యార్థి వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ మద్దూరు నీరజ పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని వివిధ ఆటలు, నాటికలు, సమూహ కార్యకలాపాలు, పరస్పర భాగస్వామ్యంతో కూడిన అభ్యాస పద్ధతులు అనుభవాధారిత కార్యక్రమాల ద్వారా నిర్వహించారు. ఇందులో 1100 మంది విద్యార్థినులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్