BREAKING
అదానీ విద్యుత్ ప్రాజెక్టు వ్యయం తగ్గింపుపై కేంద్ర పర్యావరణ శాఖ విచారణ చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ మండల స్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక పాకిస్థాన్‌కు సైనిక రహస్యాల చేరవేత: వాయుసేన వింగ్ కమాండర్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వార్డుల్లో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ నావికుడు...అత్యవసర సర్టిఫికేట్ జారీ, త్వరలో స్వదేశానికి రాక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక మేలుకొలుపు ఏకంగా 22 కిలోల బరువు తగ్గిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి.. కొత్త లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! పరాగ్వే మాజీ అధ్యక్షుడు శాంటియాగో పెన్యాపై మరింత ఉచ్చు మల్లన్నసాగర్ లీకేజీపై హరీశ్‌రావుకు కవిత సవాల్! అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధమా..? సీఎం రేవంత్‌ రెడ్డికి సూటి ప్రశ్నలు కాకరకాయ తింటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుందా.. మధుమేహ బాధితులకు నిపుణుల కీలక సూచనలు! వైఎస్సార్‌సీపీలో చేరిన జనసేన జిల్లా కార్యదర్శి అల్జీరియా వాణిజ్య నిబంధనలపై యూరోపియన్ కమిషన్‌ను ఆశ్రయించిన ఫ్రాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం ఆంత్రోపిక్‌పై ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసు

మృతి చెందిన APSPF ఉద్యోగి కుటుంబానికి రూ. 3,82,000 ఆర్థిక సహాయం అందజేత

Select Suryaa Now
మృతి చెందిన APSPF ఉద్యోగి కుటుంబానికి రూ. 3,82,000 ఆర్థిక సహాయం అందజేత

విజయవాడ, మేజర్‌న్యూస్‌ :

విజయవాడ APSPF గార్డ్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ (HC 3043) గా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ ఖాజా మొయినుద్దీన్  31-10-2026న మరణించారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు (కుమారుడు MBBS, కుమార్తె ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు) ఉన్నారు. పిల్లల భవిష్యత్తుకు మరియు కుటుంబానికి అండగా నిలవాలనే సదుద్దేశంతో '2000 బ్యాచ్ రియల్ హెల్పింగ్ గ్రూప్' సభ్యులు సమిష్టిగా సేకరించిన రూ. 3,82,000 (అక్షరాలా మూడు లక్షల ఎనభై రెండు వేల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందజేశారు. విజయవాడలోని  ముత్యాలంపాడు (GPP) APSPF కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, విజయవాడ జోన్ APSPF కమాండెంట్ ముద్దాడ శంకరరావు చేతుల మీదుగా ఈ ఆర్థిక సహాయాన్ని మృతుని సతీమణి బషీరున్నీసాకు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో విజయవాడ APSPF గార్డ్స్ అసిస్టెంట్ కమాండెంట్ హేమసుందర్ ఇన్‌స్పెక్టర్లు,2000 బ్యాచ్ గ్రూప్ సభ్యులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబానికి 2000 బ్యాచ్ రియల్ హెల్పింగ్ గ్రూప్ సభ్యులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తోటి ఉద్యోగి కుటుంబానికి ఆపద సమయంలో అండగా నిలిచిన 2000 బ్యాచ్ సభ్యుల సేవాభావాన్ని అధికారులు మరియు పలువురు సిబ్బంది అభినందించారు.