BREAKING
భారత్-పోర్చుగల్ ద్వైపాక్షిక సంబంధాల సమీక్ష..2027–2032 ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌పై దృష్టి రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. బిహార్‌లో రూ.34,470 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు పాలిటెక్నిక్‌ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అయోధ్యలో శ్రీరామ జన్మభూమి ఆలయానికి పోటెత్తిన భక్తులు పర్చూరు జడ్పిటిసి... జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న.. కలవకూరి పిచ్చమ్మ మండల టాపర్‌కు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ చెక్కు అందజేత అక్రమ ఎగ్ డొనేషన్ కేసులో IVF కేంద్రాలపై హైకోర్టు ఆగ్రహం నవంబర్ 21న పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్‌లలో ప్రధాని మోదీ పర్యటన నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ ముఖ్య సలహాదారులు పేద కుటుంబాలకు అండగా 'ఇందిరమ్మ జీవిత బీమా'- రంగపేటలో పథకాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ రేవెల్లి రాజలింగం శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ ఆలయ వద్ద మహా యజ్ఞం ప్రజాస్వామ్యం,రాజ్యాంగం పట్ల తెదేపాకి అపారమై గౌరవం : ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి మతి భ్రమించింది : దౌర్జన్యాలు, అరాచకాలకు కేరాఫ్ పెద్దిరెడ్డి కుటుంబం : తెలుగుదేశం సీనియర్ నాయకులు ఆర్.జె.వెంకటేష్ విమర్శలు ర్యాగట్లపల్లీ గ్రామంలో నూతన ఆసరా పెన్షన్ పత్రాల పంపిణీ భక్తుల సౌకర్యార్థం మరో భోజనం కేంద్రం ఏర్పాటు

మిట్స్‌లో ఆధునిక ఏఐ సాంకేతికతపై అవగాహన కార్యక్రమం : హాజరైన క్వాంటిఫై కంపెనీ టెక్ లీడ్‌ ఎం.పవన్ కుమార్

Select Suryaa Now
మిట్స్‌లో ఆధునిక ఏఐ సాంకేతికతపై అవగాహన కార్యక్రమం : హాజరైన క్వాంటిఫై కంపెనీ టెక్ లీడ్‌ ఎం.పవన్ కుమార్

కురబలకోట,మేజర్ న్యూస్ : మదనపల్లి సమీపంలో గల (మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం వారు మిట్స్ ఐఐసి,ఐ.ఎస్.టీ.ఈ  ఆధ్వర్యంలో విద్యార్థులకు  “ఎక్స్‌ప్లోరింగ్ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ (ఎంసిపి) : కనెక్టింగ్ ఏఐ విత్ ది రియల్ వరల్డ్” అనే అంశంపై శుక్రవారం ఒకరోజు వర్క్‌షాప్‌ను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెంగళూరులోని క్వాంటిఫై సంస్థలో సీనియర్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్,టెక్ లీడ్‌గా పనిచేస్తున్న ఎం.పవన్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ (ఎంసిపి) అనేది కృత్రిమ మేధస్సు వ్యవస్థలను ఇతర సమాచార వనరులు,సాఫ్ట్‌వేర్ సాధనాలతో అనుసంధానించడానికి ఉపయోగపడే ఆధునిక సాంకేతిక విధానమన్నారు.ప్రస్తుత రోజుల్లో ఏఐ సాంకేతికత వివిధ రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని,ఏఐ వ్యవస్థలు సమాచారాన్ని సేకరించడంతోపాటు వివిధ పనులను నిర్వహించడంలోనూ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.పైథాన్,జావాస్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ భాషలను ఉపయోగించి మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ సర్వర్లను రూపొందించడం,ఫైళ్లు,డేటాబేస్‌లు,అంతర్జాల సేవలను ఏఐ అప్లికేషన్లతో అనుసంధానించడం,తక్షణమే స్పందించే ఏఐ అప్లికేషన్లను అభివృద్ధి చేసే విధానాలను ఉదాహరణలతో వివరించారు.ఏఐ అప్లికేషన్లలో సమాచార భద్రత,వినియోగదారుల గుర్తింపు నిర్ధారణ,సమాచార వినియోగ అనుమతుల ప్రాముఖ్యతను తెలియజేశారు.ఏఐ అప్లికేషన్ల అభివృద్ధి,సాఫ్ట్‌వేర్ పనుల స్వయంచాలక నిర్వహణ,సమాచార అనుసంధానం,క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని,విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్,విభాగాధిపతి డాక్టర్ ఎం.శ్రీదేవి,కో-ఆర్డినేటర్స్ కే.సతీష్,డాక్టర్ బి.ప్రశాంత్,అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి