BREAKING
భారీగా పడిపోయిన బ్రిటన్ స్టాక్ మార్కెట్లు బాపట్ల జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ గా పూషడపు రోహిణి ఏకగ్రీవం నగరం మండలంలోని 27 గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ లోక్‌సభ పునర్విభజనలో ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యత ఇవ్వాలి.. పాలస్తీనా అనుకూల అమెరికా మీడియా వారసుడికి స్పెయిన్ కోర్టు ఊరట రోడ్డు ప్రమాదానికి గురైన వార్తా విలేకరి మంగలి నరసింహులును పరామర్శించి ఆర్థిక సాయం అందించిన డాక్టర్ ఏ. చంద్రప్రియ అంగోలాలో చమురు రంగంలో భారీ పెట్టుబడి ప్రజల గుండెచప్పుడు ప్రజాదర్బార్: తూర్పు ఎమ్మెల్యే నసీర్ చీమకుర్తి హరిహర క్షేత్రంలో అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్పస్వామి కలశ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం Revolut డేటా లీక్ కలకలం.. కస్టమర్లపై దాడులకు కుట్రను భగ్నం చేసిన పోలీసులు! ప్రజాసేవలో మరో అడుగు.. హొళగుంద జడ్పిటిసి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన ఈడిగ గోవింద్ గౌడ్ యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి.. భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలి. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్.. యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారి ఆశీసులతో.. అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడులు.. రెండు ట్రాక్టర్లు పట్టివేత కోగిలి సర్పంచ్ బరిలో షేక్ రషీద్.. భారీ ర్యాలీగా తరలివచ్చి నామినేషన్ దాఖలు అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రజల్లోకి..అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తామంటున్న అనుచరులు

నేటి నుంచి గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఎన్నికల అధికారి ఎం.ఎన్.వి. రాజు

Select Suryaa Now
నేటి నుంచి గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ  ఎన్నికల అధికారి ఎం.ఎన్.వి. రాజు

 

పాములపాడు: మేజర్ న్యూస్: గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నవంబర్ 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ఎన్నికల అధికారి, ఆర్వో ఎం.ఎన్.వి. రాజు శుక్రవారం తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 23వ తేదీ నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీగా నిర్ణయించినట్లు వెల్లడించారు.

నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 27న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించి తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 2వ తేదీన పోలింగ్ నిర్వహించడంతో పాటు అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుందని వివరించారు.

నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు:

మండలంలోని గ్రామాలను నిర్దేశించిన గ్రామపంచాయతీ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు.

- చెలిమిళ్ల గ్రామపంచాయతీ కార్యాలయం: చెలిమిళ్ల, లింగాల, ఇస్కాల గ్రామాలు.

- జూటూరు గ్రామపంచాయతీ కార్యాలయం: జూటూరు, తుమ్మలూరు గ్రామాలు.

- కొత్త భానుకచెర్ల గ్రామపంచాయతీ కార్యాలయం: కొత్త భానుకచెర్ల, భానుముక్కల, వేంపెంట, ఎర్రగుడూరు గ్రామాలు.

- మిట్టకందాల గ్రామపంచాయతీ కార్యాలయం: మిట్టకందాల, మద్దూరు గ్రామాలు.

- పాములపాడు గ్రామపంచాయతీ కార్యాలయం: పాములపాడు, రుద్రవరం, వానాల గ్రామాలు.

అభ్యర్థులు నిర్ణీత గడువులో సంబంధిత నామినేషన్ కేంద్రాల్లో తమ నామినేషన్లను సమర్పించాలని ఎన్నికల అధికారి సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్ పాల్గొన్నారు.