మీకోసం అర్జీలపై సత్వరమే స్పందించాలి
మచిలీపట్నం, మేజర్ న్యూస్ : ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ప్రతి అర్జీదారుడి సమస్యను ఓపికగా విని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల నుంచి అందే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు సకాలంలో పరిష్కరించి న్యాయం చేయాలని, సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అర్జీల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పరిష్కార స్థితిని అర్జీదారులకు తెలియజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో కే.శ్రీధర్‌రెడ్డి, కేఆర్‌ఆర్‌సీ ఎస్‌డీసీ పి.నీలకంఠేశ్వరరెడ్డి, డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు, జెడ్పీ డిప్యూటీ సీఈవో డాక్టర్ ఆనంద్‌కుమార్, ఆర్‌అండ్‌బీ ఈఈ లోకేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ హరిహరనాథ్, మెప్మా పీడీ సాయిబాబు, ఎల్‌డీఎం సి.రవీంద్రారెడ్డి, డీపీఓ ఎం.ధనలక్ష్మి, సర్వే ఏడీ లక్ష్మణరావు, డ్రైనేజీ శాఖ ఈఈ కిరణ్‌బాబు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫణి ధూర్జటి, పంచాయతీరాజ్ ఎస్ఈ పీవీ రమణారావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ సోమశేఖరరావు, డ్వామా పీడీ ఎన్.శివప్రసాద్ యాదవ్, హౌసింగ్ పీడీ వెంకట్రావు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం.