BREAKING
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 103 ఫిర్యాదులు పోలీసులకు మూడు నూతన స్నిఫర్ డాగ్స్ కానిస్టేబుళ్లదే కీలక పాత్ర.. ప్రజలతో మర్యాదగా మెలగాలి బాల న్యాయ వ్యవస్థపై పోలీసులకు అవగాహన పోరంకి–కానూరుకు రూ.34.92 కోట్ల అభివృద్ధి పనులు.. తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు...జనతా పరివార్ పార్టీ అభ్యర్థుల ప్రకటన అభివృద్ధిని చూసి వైసీపీకి కడుపుమంట.. అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌.. రూ.5 లక్షల సొత్తు, రెండు కార్లు స్వాధీనం ఇంట్లో ఇనుపరాడ్‌తో భార్యపై దాడి మేయర్‌గా బొండా సిద్ధార్థకు అవకాశం కల్పించాలి వైభవంగా విజయవాడ ఉత్సవ్–2.. జాతీయస్థాయి కుంగ్ ఫూ కరాటే పోటీల్లో శ్రీ సత్య విద్యానికేతన్ విద్యార్థుల ప్రతిభ. గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి పల్లె పండుగ 3.0తో పల్లెలకు మహర్దశ - పి.గన్నవరంలో రూ.4.30 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గిడ్డి శంకుస్థాపన పత్తి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి.

మౌళిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత

Select Suryaa Now
మౌళిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత
  • పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష
  • 26వ వార్డులో సీసీ రోడ్డుకు శంకుస్థాపన

పలాస: పలాస కాశీబుగ్గ పురపాలక సంఘ ప్రజలకు అవసరమయ్యే మౌళిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డులో రూ.8 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శిరీష ఆదివారం శంకుస్థాపన చేశారు.15వ ఆర్థిక సంఘం నిధులతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు.ఈ రోడ్డు పూర్తయితే స్థానికులకు రాకపోకలు సులభతరం కానున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులకు, వాహనదారులకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని, వార్డుల వారీగా సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష తెలిపారు.కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ.బాబూరావు,మల్లా శ్రీనివాసరావు,శాసనపురి మురళీకృష్ణ,బడ్డ.నాగరాజు,లొడగల కామేశ్వరరావు,దువ్వాడ శ్రీకాంత్,సవర రాంబాబు, మలిపెద్ది నరేంద్ర కుమార్,కొవ్వూరి సురేష్ కుమార్,సప్ప నవీన్,యవ్వారి మోహన్ రావు,ఉప్పాడ పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.