BREAKING
కార్తీక మాసంలో మల్లేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు దుర్గమ్మను దర్శించుకున్న సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు యువతలో నాయకత్వ లక్షణాలకు యూత్ పార్లమెంట్ పోటీలు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం : కలెక్టర్ డీకే బాలాజీ జనగణన–2027 రెండో దశను పకడ్బందీగా నిర్వహించాలి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు నగర పోలీస్ కమిషనర్ నివాళులు ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ట్రాఫిక్‌ పోలీసుల విస్తృత తనిఖీలు ఆజాద్ ఆశయాలతో విద్యారంగ అభివృద్ధికి లోకేష్ కృషి మౌలానా ఆజాద్ సేవలు చిరస్మరణీయం చందర్లపాడు మండల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా : ఎంపీ కేశినేని చిన్ని విజయవాడకు మరోసారి జాతీయస్థాయి స్వచ్ఛత పురస్కారం కృష్ణా జడ్పీ పీఠంపై ఉత్కంఠ! ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా హోటళ్లు, ఆహార సంస్థలు పనిచేయాలి పోరంకిలో ఘనంగా ‘మైండ్ స్పార్క్’ విజ్ఞాన ప్రదర్శన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలు, విద్యా సేవలు చిరస్మరణీయం

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

Select Suryaa Now
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

విజయవాడ కార్పొరేషన్, మేజర్ న్యూస్ : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదనపు కమిషనర్లు ఏ. రవీంద్రరావు, కే. శకుంతలతో పాటు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ ఏ. రవీంద్రరావు మాట్లాడుతూ, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశ విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. విద్య ద్వారానే సమాజంలో సమానత్వం, అభ్యున్నతి సాధ్యమని విశ్వసించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్, దేశంలో ఆధునిక విద్యావ్యవస్థకు బలమైన పునాదులు వేశారని కొనియాడారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, గొప్ప విద్యావేత్తగా, జాతీయ సమైక్యతకు ప్రతీకగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ అందించిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ప్రభావతి, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. 

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.