BREAKING
ఓటు లెక్కింపులో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ముగిసిన రెండో విడత ప్రసారం కోల్ ఇండియా స్థాయి క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించాలి బంగారం కోసం వృద్ధురాలి హత్య కేసు... -- ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా మంత్రి శ్రీధర్ బాబు సర్పంచ్ అభ్యర్థులతో పోలీసుల ఎన్నికల అవగాహన సమావేశం ఇంటింటికీ మెరుగైన వైద్యం అందేలా పనిచేయాలి గొట్టిపల్లి సర్పంచ్‌గా అవ్వ తేజేశ్వరి ఏకగ్రీవ ఎన్నిక.. గత ప్రభుత్వ హయాంలోనే హుజురాబాద్ అభివృద్ధి -- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పూర్ణిమకు మద్దతుగా మహిళల భారీ ర్యాలీ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కోటబొమ్మాళి విద్యార్థిని ఎంపిక ఆర్థిక సహాయం...... మేజర్ పంచాయతీ పోరు రసవత్తరం.. భూ వివాదాలకు తావులేని గ్రామాలే లక్ష్యం. తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి

మనల్ని నమ్ముకునీ పంచాయతీ ఎన్నికల్లో మద్దతిచ్చిన ప్రజలకు మనం ఎప్పుడూ అండగా నిలవాలి - మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు .

Select Suryaa Now
మనల్ని నమ్ముకునీ పంచాయతీ ఎన్నికల్లో మద్దతిచ్చిన ప్రజలకు మనం ఎప్పుడూ అండగా నిలవాలి - మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు .

సీతానగరం నవంబర్ 27 మేజర్ న్యూస్ ... పార్వతిపురం నియోజకవర్గం సీతానగరం మండలం తామరకండి గ్రామపంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు మన్మధరావు ఘనవిజయం సాధించిన శుభ సందర్భంగా గ్రామ వైసీపీ శ్రేణులు అందరితో కలిసి శుక్రవారం స్థానిక మాజీ శాసనసభ్యులు నియోజకవర్గం సమన్వయకర్త  అలజంగి జోగారావునీ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకోవడం జరిగినది. ఈ సందర్భంగా జోగారావు గారు సర్పంచ్ మన్మధరావుకు గ్రామ నాయకులకు కార్యకర్తలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ కష్టకాలంలో వెన్నంటి నిలవడమే కాకుండా గ్రామంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పంచాయతీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం శుభ పరిణామం అని మీరందరూ కూడా ఇది ఐక్యతతో గ్రామంలో పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లి రానున్న సాధారణ ఎన్నికల్లో కూడా ఇదే ఫలితాన్ని నమోదు చేసేందుకు కృషి చేయాలని, మనపై నమ్మకం నుంచి ఇంతటి ఘన విజయాన్ని అందించిన గ్రామ ప్రజలకు మనం ఎప్పుడూ రుణపడి ఉంటూ వారికి ఎల్లవేళలా అండగా నిలవాలని ఆయన పిలుపు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మూడడ్ల శంకర్రావు, మాజీ ఎంపీటీసీ ఏగిరెడ్డి శ్రీనివాసరావు, ఏగిరెడ్డి అచ్యుత నాయుడు, సీనియర్ నాయకులు ఏగిరెడ్డి స్వామి నాయుడు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.