మల్కాపురం లో పిడుగుపాటుకు 25 పొట్టేలు పిల్లలు మృతి
ధర్మవరం రూరల్ సెప్టెంబర్ 30 మేజర్ న్యూస్
ధర్మవరం మండలం పరిధిలోని మల్కాపురం గ్రామంలో బుధవారం సాయంత్రం పిడుగుపడి 25 పొట్టేలు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందాయి.
బాధితుడు బిల్లే విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... తన 25 పొట్టేలు పిల్లలను మేత కోసం సమీపంలోని చెట్టు కింద కంచలో ఉంచాడు. అదే సమయంలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడి, ఆ చెట్టుపై పిడుగు పడింది. ఈ ప్రమాదంలో కంచలోని పొట్టేలు పిల్లలన్నీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి.
ఈ ప్రమాదం వల్ల తనకు సుమారు ₹2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం స్పందించి పరిహారం అందించి ఆదుకోవాలని బాధితుడు అశోక్ కుమార్ కన్నీటిపర్యంతమయ్యాడు.