మహిళల భద్రత సైబర్ క్రైమ్ ఫై విద్యార్థులకు అవగాహన
ఏలూరు,మేజర్ న్యూస్: జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలపై ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు,ఆధ్వర్యంలో మహిళా ఎస్ఐ నాగమణి, ఏ ఎస్ ఐ రామ లక్ష్మీ ,సిబ్బంది తో కలిసి నారాయణ కళాశాలలో విద్యార్థులకు మహిళల భద్రత, సైబర్ క్రైమ్, డ్రగ్స్, ర్యాగింగ్ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మహిళలు వెంటనే 112 లేదా 7993485111 (శక్తి) నెంబర్ కు కాల్ చేయవచ్చారు.ఈ నెంబర్ ద్వారా తక్షణ సహాయం అందుబాటులో ఉంటుందన్నారు. శక్తి యాప్ ను ప్రతి మహిళా తన మొబైల్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసు కోవాలన్నారు. ఈ యాప్ ద్వారా అత్యవసర సమయంలో ఒకే క్లిక్ తో సహాయం కోరవచ్చన్నారు.ఈ యాప్ లో లోకేషన్ ట్రాకింగ్, ఎస్ఓఎస్ అలర్ట్,పోలీస్ సహాయం తక్షణం అందు తుందన్నారు.ఒంటరి మహిళల కు రాత్రి 10 నుండి ఉదయం 5 వరకు ఉమెన్ డ్రాప్ వాహన సేవల అందుబాటులో ఉంటాయి.ర్యాగింగ్ చేస్తే కఠినమైన శిక్షలు విధించబ డతాయి.ఎవరైనా బాధితులు వెంటనే డయల్ 112 కి లేదా కాలేజ్ అధికారులకు తెలియజేయాలన్నారు.డ్రగ్స్ వాడకం, ఆన్ లైన్ గేమ్స్ వల్ల విద్యార్థులు దారి తప్పే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు, ఉపాధ్యా యులు పిల్లలపై నిత్యం నిఘా పెట్టాలి. అవసరమైతే కౌన్సిలింగ్ సెంటర్ల సహాయం తీసుకోవాలి.సైబర్ మోసాలు గురైన వారు వెంటనే 1930 కి ఫిర్యాదు చేయండి. సైబర్ మోసాలు జరిగినప్పుడు వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. మీ డేటా, డబ్బు సురక్షితంగా ఉండేందుకు జాగ్రత్తలు పాటించండి.తప్పు దారిలో వెళ్తున్న విద్యార్థులకు కౌన్సిలింగ్ సెంటర్లు చదువును పక్కనబెట్టి తప్పు మార్గంలో వెళ్తున్న విద్యార్థులకు మేము కౌన్సిలింగ్ సెంటర్ల ద్వారా సహాయం అందిస్తున్నాం.మా దగ్గర 1 స్టాప్ సెంటర్, భూమిక ఉమెన్స్ కలెక్టివ్ సెంటర్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. మహిళా విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు ఈ సేవలను వినియోగించుకుని, భద్రత గా ఉండాలని కోరుకుంటున్నాము అని మహిళా పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ,ఏ ఎస్ ఐ రామ లక్ష్మీ తెలిపారు.
పసుమర్తి రాము జిల్లా ఇంచార్జ్ ఏలూరు