మదనపల్లి మున్సిపాలిటీలో 1, 11, 15 వార్డుల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం 72 టేబుళ్లపై కొనసాగుతున్న కౌంటింగ్.. తొలి రౌండ్ ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ
మదనపల్లి మున్సిపాలిటీలో 1, 11, 15 వార్డుల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం
72 టేబుళ్లపై కొనసాగుతున్న కౌంటింగ్.. తొలి రౌండ్ ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ
మదనపల్లె, నవంబర్ 3:
మదనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో 1, 11, 15 వార్డుల ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు.
మూడు కౌంటింగ్ హాళ్లలో మొత్తం 72 టేబుళ్లపై సిబ్బంది ఏకకాలంలో ఓట్లను లెక్కిస్తున్నారు. పింక్, వైట్ బ్యాలెట్ పత్రాలను 25 చొప్పున కట్టలుగా విభజించిన అనంతరం అభ్యర్థుల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టారు.
అబ్జర్వర్ జి. బాలకృష్ణ, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోంది. తొలి రౌండ్ ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థులు, వారి మద్దతుదారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
శ్రీనివాసులు సూర్య స్టాఫ్ రిపోర్టర్, మదనపల్లి